Niti Aayog: జగన్ పాలనపై నీతి ఆయోగ్ సంచలన నివేదిక

వైసీపీ అయిదేళ్ల పాలనలో ఏపీ అన్ని రంగాల్లోనూ సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ విషయం మరోమారు స్పష్టమైంది. జగన్ పాలనలో ఏపీ ఆర్థిక, ఆరోగ్యం అత్యంత దయనీయంగా ఉందని నీతి ఆయోగ్ వెల్లడించింది. 2022-23లో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనుకబడిందని, ఆరోగ్యం అత్యంత దయనీయంగా ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది. 2022-23 ఆర్థిక ఆరోగ్య డేటాను నీతి ఆయోగ్ విడుదల చేసింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో 17వ స్థానంలో నిలిచినట్లు డేటాలో నీతి ఆయోగ్ పేర్కొంది. ఆ ఏడాది ఆర్థిక ఆరోగ్యంలో ఒడిశా అద్భుతంగా ఉందని, తర్వాత స్థానంలో ఛత్తీస్‌గఢ్ ఉండగా... 8వ స్థానంలో తెలంగాణ నిలిచిందని చెప్పింది. మిగిలిన అన్ని రాష్ట్రాల ఆర్థిక, ఆరోగ్య స్థితి బావుందని నివేదికలో నీతి ఆయోగ్ పొందుపరిచింది. నాణ్యతతో కూడిన ఖర్చులు, రెవెన్యూ సమీకరణ, ఆర్థిక హేతుబద్ధత, అప్పుల జాబితా, అప్పులు తిరిగి చెల్లించగలిగే సామర్థ్యం వంటి అంశాలపై నీతి ఆయోగ్ కమిటీ అధ్యయనం చేసింది. నీతి ఆయోగ్ నివేదికను 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా విడుదల చేశారు.
ఎనిమిదో స్థానంలో తెలంగాణ
నీతి ఆయోగ్ 2022-23 ఏడాదికి గాను ఆర్థిక ఆరోగ్య డేటా విడుదల చేసింది. 2022-23లో ఏపీ 17వ స్థానంలో నిలిచినట్టు నీతి ఆయోగ్ పేర్కొంది. ఆ ఏడాది ఏపీ ఆర్థిక ఆరోగ్య స్థితి అత్యంత దయనీయంగా ఉందని తెలిపింది. అదే సమయంలో తెలంగాణ 8వ స్థానంలో నిలిచిందని వెల్లడించింది. 2022-23లో పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య స్థితి బాగుందని వివరించింది. రాష్ట్రాల రెవెన్యూ సమీకరణ, వ్యయం, అప్పులు, చెల్లింపుల సామర్థ్యం తదితర అంశాల ప్రాతిపదికగా నీతి ఆయోగ్ ఈ నివేదిక రూపొందించింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఈ నివేదికను విడుదల చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com