కడప జిల్లాలో వరద బీభత్సం

కడప జిల్లాలో నివర్ బీభత్సం కొనసాగుతోంది. చెయ్యేరు పరివాహక ప్రాంతాల్లో గ్రామాల్లోకి అన్నమయ్య డ్యామ్ నుంచి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో తాళ్ళ పాక పంచాయతీలోని హేమాద్రి వారిపల్లే నీటి మునిగింది. నందలూరు మండలంలోని గోళ్ల పల్లె గ్రామాల్లోకి చెయ్యేటి లోని వరద నీటి ప్రవావాహం చేరింది. హేమాద్రి వారి పల్లె గోళ్ల పల్లె గ్రామాల చుట్టూ వరద నీరు చేరుకోవడంతో అక్కడ వరద నీటి మట్టం క్రమ క్రమంగా పెరుగుతోంది. దీంతో బాధిత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ లోకి భారీగా వరద నీరు చేరింది. గౌతమ్ నగర్ నీలపల్లి ఆర్ అండ్ బి బంగ్లా వెనుక బస్టాండ్ సమీపంలోని ఇళ్లల్లోకి ఆరడుగుల మేర నీరు చేరింది. ప్రజలు రాత్రి నుండి బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. నందలూరు అరుంధతీవాడ ప్రజలను పాఠశాలకు తరలించారు అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com