గంటన్నర పాటు ఎదురుచూసినా అంబులెన్స్ రాలేదు.. చివరికిలా..

గంటన్నర పాటు ఎదురుచూసినా అంబులెన్స్ రాలేదు.. చివరికిలా..
ప్రభుత్వం పెద్దఎత్తున అంబులెన్స్‌ సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చామని గొప్పలు చెబుతున్నా.... క్షేత్రస్థాయిలో ప్రజలకు..

ప్రభుత్వం పెద్దఎత్తున అంబులెన్స్‌ సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చామని గొప్పలు చెబుతున్నా.... క్షేత్రస్థాయిలో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో దుంగాడ గ్రామానికి చెందిన గర్భిణి... సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో తీవ్ర అవస్థలు పడింది. కస్తూరి దేవుడమ్మ అనే గిరిజన మహిళను ప్రసవం కోసం కుటుంబ సభ్యులు తొమ్మిది కిలో మీటర్ల దూరం డోలీలో మైదాన ప్రాంతమైన దబ్బాగుంటకు తీసుకొచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత 108 అంబులెన్స్ కోసం చెట్టు కింద నిరీక్షించారు. గంటన్నర పాటు ఎదురుచూసినా అంబులెన్స్ రాలేదు. పురిటి నొప్పులతో బాధ పడుతున్న దేవుడమ్మను ఆటోలో శృంగవరపుకోట హాస్పిటల్‌కు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story