AP: ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ

AP: ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ
X

ఆంధ్రప్రదేశ్ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రభుత్వం నియమించింది. టీడీపీకి 37, జనసేనకు 8, బీజేపీకి 2 చైర్మన్ పదవులను కేటాయించారు. మార్కెట్ కమిటీ సభ్యులతో కలిసి మొత్తం 705 నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ పదవుల భర్తీలో జనసేనకు సముచిత స్థానం ఇవ్వడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం ప్రారంభించింది. ఇప్పటికే 62 కార్పొరేషన్‌ పోస్టులు భర్తీ అయ్యాయి. టీడీపీ 49, జనసేన 10, బీజేపీ 3 చొప్పున పంచుకున్నాయి. ఇంకా 214 మార్కెట్‌ కమిటీలు, 1100 ట్రస్ట్‌ బోర్డ్స్‌లో నామినేటెడ్‌ పదవులు ఉన్నాయి. మొత్తం 1314 పోస్టులు ఉన్నాయి. వీటి కోసం ఏకంగా 60 వేల అప్లికేషన్లు వచ్చాయి. తొలి విడతగా 47 ఏఏంసీ ఛైర్మెన్ల పదవులను ప్రకటించారు.

Tags

Next Story