NREGA Bill: నరేగా బిల్లుపై హైకోర్టు తీర్పు ఏంటి?

NREGA Bill: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 20 శాతం తగ్గించి ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చిన జీవోను కోర్టు కొట్టివేసింది.. నాలుగు వారాల్లోపు బిల్లులు మొత్తం చెల్లించాల్సిందేనని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొత్తం 1013 పిటిషన్లలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే కొంత మొత్తం చెల్లించామని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించగా.. బకాయిలను 12 శాతం వడ్డీతో చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
నరేగా బిల్లుల చెల్లింపుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమన్నారు న్యాయవాది శ్రావణ్ కుమార్. ఈ తీర్పుతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు. ఒక ప్రభుత్వం కాంట్రాక్టు ఇస్తే మరో ప్రభుత్వం దాన్ని పాటించాలన్నారు. గత ప్రభుత్వంలో చేసిన పనులను పార్టీలు, వ్యక్తులకు ఇచ్చినట్లు చూడకూడదని న్యాయవాది శ్రావణ్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com