NTR ఘాట్ వద్ద కుటుంబసభ్యుల నివాళి

నేడు ఎన్టీఆర్ శతజయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుమారుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ..మనవడు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి రామకృష్ణ తదితరులు నివాళులర్పించారు.అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహాలకు అభిమానులు పూలమాల వేసి ఘన నివాళులర్పిస్తున్నారు.
ఎన్టీఆర్ తెలుగు జాతికి చేసిన సేవలు మరువలేనివన్నారు బాలకృష్ణ. సినీరంగంతో పాటు రాజకీయ రంగంలో ఓ వెలుగు వెలిగారని గుర్తు చేశారు. తెలుగువారి రుణం తీర్చుకునేందుకే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని చెప్పారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ కుమారుడిగా జన్మించడం తన అదృష్టమన్నారు బాలకృష్ణ.
ఎన్టీఆర్ పుట్టిన గడ్డపై తాను జన్మించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన రాజేంద్ర ప్రసాద్.. ఎన్టీఆర్ శతజయంతిని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. ఇవాళ ప్రతీ ఒక్కరూ ఎన్టీఆర్ తలుచుకోవాలన్నారు రాజేంద్ర ప్రసాద్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com