NTR: మహిళా సాధికారకతకు ఎన్టీఆర్ కృషి

తిరుపతిలో నిర్వహించిన జాతీయ మహిళా సాధికారిత సదస్సులో ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. స్వయంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ గుర్తు చేశారు. మహిళా సాధికారితకు నందమూరి తారకరావు ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. ఎన్టీఆర్‌కు ప్రణామాలు అంటూ సభను హరివంశ్ నారాయణ సింగ్ ఉత్తేజపరిచారు. అభివృద్ది చెందిన దేశాల్లో మహిళలకు ప్రధాన్యత ఇచ్చారని చెప్పారు. మహిళ సాధికారత కోసం ప్రధాని మోడీ చాలా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. బీహార్ ఎన్నికల్లో తొలిసారిగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. జన్ థన్ యోజనలో మహిళలకు సగానికి పైగా ఖాతాలున్నాయన్నారు. టెక్నాలజీ హబ్‌గా ఉమ్మడి ఏపీని సీఎం చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దారని గుర్తు చేశారు. ఏపీలోనే తొలిసారిగా నైపుణ్య గణనను చేపట్టారన్నారు. శ్రీసిటీలో మహిళా ఉద్యోగులు సగానికిపైగా ఉన్నారని హరివంశ్ సింగ్ పేర్కొన్నారు.
తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు ప్రారంభం
తిరుపతిలో తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు ప్రారంభమైంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్‌కు మహిళల నాయకత్వం’ అనే నినాదంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ముఖ్యఅ తిథిగా ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సదస్సుకు శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రి పయ్యావుల కేశవ్, పార్లమెంట్ కమిటీ (మహిళా సాధికారత) ఛైర్పర్సన్ దగ్గుబాటి పురందేశ్వరితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూటమి నేతలు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. మహిళలకు గౌరవం ఇవ్వడం ఆది నుంచి వస్తున్న భారత సంప్రదాయమని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక ఉద్యమాల్లో స్త్రీలు కీలక పాత్ర పోషించారని చెప్పారు. తిరుపతిలో నిర్వహించిన జాతీయ మహిళా సాధికారత సదస్సులో ఆయన మాట్లాడారు. ‘‘స్వాతంత్ర్య పోరాటంలోనూ మహిళలు కీలకపాత్ర పోషించారు. వారి భాగస్వామ్యం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదు. సామాజిక బంధనాలను ఛేదించుకుని మహిళలు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. వారికోసం రాజ్యాంగం అనేక నిబంధనలు రూపొందించింది. మహిళా శక్తి కారణంగానే ఇవాళ ప్రపంచంలోనే భారత్ ముఖ్యదేశంగా అవతరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com