జడ్జీలపై అసభ్యకర పోస్టులు : సీబీఐ కేసు నమోదు

జడ్జీలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల మీద సీబీఐ కేసు నమోదు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ.. సీఐడీ నమోదు చేసిన కేసులను పరిశీలించింది. గతంలో హైకోర్టు ఆదేశాలతో 17 మందిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. అయితే సీఐడీ దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. ఈ కేసును సీబీఐకి అప్పగించింది. తాజాగా విశాఖలో 12 కేసును రిజిస్టర్ చేసింది సీబీఐ.
సోషల్ మీడియాలో జడ్జిలపై అసభ్యకర పోస్టింగులు పెట్టిన వారిలో కొండారెడ్డి, మణి అన్నపురెడ్డి, సుధీర్ పాముల, ఆదర్శ్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, శివారెడ్డి, శ్రీధర్ రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, జి.శ్రీధర్ రెడ్డి, లింగారెడ్డి, చందు రెడ్డి, శ్రీనాథ్, కిషోర్ రెడ్డి, చిరంజీవి, రాజశేఖర్ రెడ్డి, గౌతమిపై సీబీఐ కేసు నమోదు చేసింది.
Next Story