TG: హిజ్రాతో కొడుకు ప్రేమ.. తల్లిదండ్రుల ఆత్మహత్య

TG: హిజ్రాతో కొడుకు ప్రేమ.. తల్లిదండ్రుల ఆత్మహత్య
X
పోస్టుమార్టం గదిలో అనాథలుగా శవాలు.. నంద్యాలలో దారుణం..

అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కుమారుడు హిజ్రాతో సన్నిహితంగా ఉంటున్నాడని తెలిసి ఆ తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నంద్యాలలో జరిగింది. చేతికి అందివచ్చిన కుమారుడు ఉన్నప్పటికీ పోస్టుమార్టం గదిలో అనాథ శవాల మాదిరిగా వారిని ఉన్న వారిని చూసిన వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.నంద్యాల ఎస్‌బీఐ కాలనీకి చెందిన సుబ్బరాయుడు(43), సరస్వతి(37) దంపతుల కుమారుడు సునీల్‌ బీటెక్‌ మొదటి సంవత్సరం ఫెయిలై ఆటో డ్రైవర్లతో జత కట్టాడు. ఈనేపథ్యంలో హిజ్రాలతో తిరుగుతూ ఓ హిజ్రాతో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సునీల్‌ను తీసుకొచ్చి బంధువుల వద్దకు పంపారు. అప్పటి నుంచి హిజ్రాల బృందం సుబ్బరాయుడు దంపతులు నడుపుతున్న దుకాణం వద్దకు వచ్చి వికృత చేష్టలతో వేధించడం, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగారు. స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినా కోలుకోలేక దంపతులిద్దరూ మృతి చెందారు.

పెళ్లికి సిద్దమయ్యాడనేనా..?

ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకోవడానికి సునీల్ సిద్దమయ్యారు. అయితే ఆ తల్లిదండ్రులు మాత్రం కొడుకు మనసు మార్చేందుకు చాలా ప్రయత్నం చేశారు సమాజంలో చులకన అవుతామని ఎంతో చెప్పి చూశారు. కానీ సునీల్ మాత్రం తన ప్రేమనుఏ మాత్రం తగ్గించుకునేది లేదని తాను స్మితను పెళ్లి చేసుకుని తీరుతానని ప్రకటించారు. దాంతో ఆ తల్లిదండ్రులు..ట్రాన్స్ జెండర్లు ఎక్కువగా ఉండే ప్రాంతానికి వెళ్లి స్మిత గురించి ఆరా తీశారు. ఆమెకు సంబంధించిన వారితో మాట్లాడారు. అయితే అక్కడా వారికి తిరస్కారమే ఎదురైంది. వారు ప్రేమించుకుంటున్నారు.. పెళ్లి చేసుకుంటారని మధ్యలో అడ్డు రావొద్దని వారు చెప్పి పంపేశారు. తమ కుమారుడు తమ మాట వినడం లేదని.. ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకుంటే ఊళ్లోవాళ్లు అంతా తమను మరో రకంగా చూస్తారన్న ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు కుమిలిపోయారు. చివరికి ప్రాణం తీసుకున్నారు.

ఆత్మహత్య చేసుకోవాలా..?

కుమారుడు తనకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాడని దానికి వీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని ఎక్కువ మంది నిట్టూరుస్తున్నారు. మొత్తంగానికి ట్రాన్స్ జెండర్ ప్రేమ కారణంగా సునీల్ తన తల్లిదండ్రుల్నికూడా కోల్పోయాడు. వీరి ఆత్మహత్యపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో కేసులు నమోదు కాలేదని పోలీసులు చెబుతున్నారు.

Tags

Next Story