ఎమ్మెల్యే శ్రీదేవి అండ్ గ్యాంగ్ భూ కబ్జాలను బట్టబయలు చేసిన లోకేష్

పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అండ్ గ్యాంగ్ భూముల కబ్జాను నారా లోకేష్ బట్టబయలు చేశారు. చెర్లకొత్తూరు గ్రామానికి చెందిన దళితుల భూములను ఎమ్మెల్యే శ్రీదేవి, వైసీపీ గ్యాంగ్ ఆక్రమించుకున్నారని శనివారం లోకేష్ ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీదేవి.. ఆ కబ్జాలతో తనకు సంబంధం లేదని, తాను ఎలాంటి అవినీతి చేయలేదని ప్రెస్‌మీట్ పెట్టి మరీ యువనేతపై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆధారాలతో సహా ఎమ్మెల్యే శ్రీదేవి కబ్జా బాగోతాన్ని బయటపెట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్. ఎమ్మెల్యే అండ్ వైసీపీ గ్యాంగ్ ఆక్రమించుకున్న దళిత భూముల డాక్యుమెంట్లను లోకేష్ విడుదల చేశారు.
పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, వైసీపీ గ్యాంగ్ దళితుల భూములు కబ్జా చేసింది నిజం. ఆక్రమించింది మేము కాదు అని గట్టిగా అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు ఎమ్మెల్యే గారు అంటూ లోకేష్ చురకలంటించారు. చెర్లకొత్తూరు గ్రామానికి చెందిన దళితులకు పేరేముల గ్రామంలోని సర్వే నెంబర్ 249, 250లలో 25 ఎకరాల భూమి ఉంది. వీటిని ఆక్రమించుకునేందుకు ఓబులాపురానికి చెందిన విష్ణువర్థన్ రెడ్డి పేరిట సృష్టించిన దొంగ డాక్యుమెంట్లు చూడండంటూ ప్రజల ముందుంచారు లోకేష్. వైసీపీ నేతలు భూమన్నగారి సంజీవరెడ్డి, ఒడ్డూరు వరలక్ష్మీ, పోతిరెడ్డిగారి అరుణమ్మ, అలవాల సూర్యనారాయణరెడ్డి కబ్జాకి ఆధారాలు ఈ పత్రాలని ఆరోపించారు. ఇప్పుడు చెప్పగలరా ఎమ్మెల్యే గారు.. ఈ కబ్జాలో మీ అనుచరుల హస్తం లేదని అంటూ నారా లోకేష్ సవాల్ విసిరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com