YSRCP : సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోని వైసీపీ.. ఇదేం తీరు..

ఏపీ కల్తీ నెయ్యి కేసు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని వైసీపీ నేతలు చేస్తున్న ప్రతయ్నాలు అన్నీ ఇన్నీ కావు. సిబీఐ నియమించిన సిట్ నివేదికలో తమ పేర్లు యాడ్ చేయలేదని చాలా మంది వైసీపీ నేతలు రిలాక్స్ అయ్యారు. కానీ అంతటి మహాఘోరం చేసిన వారిని విడిచిపెట్టేది లేదని ఏపీ ప్రభుత్వం ఏకసభ్య విచారణ కమిటీ వేస్తే గగ్గోలు పెడుతున్నారు. అదేంటి మేం ఇంత కాలం సేఫ్ అనుకుంటే ఇప్పుడు మమ్మల్ని బయటకు లాగేందుకు వన్ మ్యాన్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అంటూ సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. సుబ్రహ్మణ్యస్వామితో పిటిషన్ వేయిస్తే.. కోర్టు చీవాట్లు పెట్టింది. ఏకసభ్య విచారణ కమిటీ వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయినా సరే వైసీపీ మాత్రం ఏకసభ్య విచారణ కమిటీ వద్దంటూ నానా యాగీ చేస్తోంది. ఏదో ఒకటి చేసి వన్ మ్యాన్ కమిషన్ వేయకుండా చూసేందుకు జగన్ నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే బొత్స సత్యనారాయణ శాసనమండలిలో లేనిపోని వాదనలు చేస్తున్నారు. అటు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి నానా అబద్దాలు ఆడేస్తున్నారు. ఇలా వారు ఎన్ని చేసినా సరే నిందితులను మాత్రం విడిచిపెట్టేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెబుతున్నారు.
దీంతో వైసీపీలో కొత్త టెన్షన్ మొదలైంది. ఎలాగైనా ఈ ఏకసభ్య విచారణ కమిటీ నుంచి తప్పించుకునేందుకు తమకు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఎంత భక్తి, ప్రేమ ఉన్నాయో చూడండి అంటూ కొత్త డ్రామాలకు తెర తీస్తున్నారు. వాళ్లు ఎన్ని సింపతీ గేమ్స్ ఆడినా సరే వదిలిపెట్టేది లేదని కూటమి పట్టుదలతో ముందుకు వెళ్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
