Vijayawada: ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలి వ్యక్తి మృతి.. కొన్న ఒక్కరోజులోనే..

Vijayawada: ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలి వ్యక్తి మృతి.. కొన్న ఒక్కరోజులోనే..
X
Vijayawada: నిజామాబాద్‌లో మొన్న ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలిన ఘటన మరువక ముందే.. మరో ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

Vijayawada: నిజామాబాద్‌లో మొన్న ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలిన ఘటన మరువక ముందే.. మరో ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. సూర్యారావుపేట గులాబీతోటలో ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. శివకుమార్‌ అనే వ్యక్తి నిన్ననే కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ కొన్నాడు. ఇంట్లో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి పడుకున్నాడు.

తెల్లవారుజామున ఒక్కసారిగా పేలింది. ఇల్లు మొత్తం మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో శివకుమార్‌తో పాటు భార్య, ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకుపోయారు. మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు ఇంటి తలుపులు పగులగొట్టారు. తీవ్ర గాయాలపాలైన శివకుమార్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అతని భార్య పరిస్థితి విషమంగా ఉంది.

Tags

Next Story