JAANSENA: జనసేనలోకి పెరిగిన చేరికలు.. టెన్షన్‌లో వైసీపీ..?

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి క్షేత్ర స్థాయిలో బలం పెంచుకునేలా జనసేన అడుగులు వేస్తుంది. అందుకే రాష్ట్ర స్థాయి నేతల నుంచి క్షేత్ర స్థాయి నేతల వరకు పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానిస్తుంది. తాజాగా మంగళగిరిలో నాగబాబు సమక్షంలో పలువురు జనసేనలో చేరారు. ఇలా పవన్ పార్టీలో చేరిన వారిలో ఎక్కువ మంది వైసీపీ వాళ్లు ఉన్నారు. దీంతో తమ పార్టీ నుంచి ఇంకెన్ని జంపింగ్స్ ఉంటాయో అని YCP టెన్షన్ పడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అడ్వాంటేజ్ కోసం జనసేనలో చేరొద్దు: నాగబాబు
జనసేన పార్టీలో చేరికలపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అడ్వాంటేజ్ కోసం పార్టీలో చేరొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేయడానికి సిద్దమైన వారే పార్టీలోకి రావాలన్నారు. కాగా పార్టీ కార్యాలయంలో నాగబాబు సమక్షంలో పలువురు జనసేనలో చేరిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.
మంత్రి నాదెండ్లను కలిసిన జనసేన నేతలు
మంత్రి, జనసేన పార్టీ PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను సోమవారం అవుకు మండల జనసేన పార్టీ నాయకులు అజిత్ రెడ్డి, జనార్దన్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు చెక్కులు అందజేసే కార్యక్రమంలో మంత్రిని కలిసి స్థానిక జనసేన పార్టీ స్థితిగతులపై మంత్రి నాదెండ్లకు వివరించినట్లు పేర్కొన్నారు.
కార్యకర్తలకు అండగా : మంత్రి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్త కుటుంబానికి రూ.5లక్షల ప్రమాద బీమా చెక్కును మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. ఆదివారం మంగళగిరి చిల్లపల్లి మండపంలో జరిగిన కార్యక్రమంలో గత ఏడాది రోడ్డు ప్రమాదంలో తాడేపల్లి పరిధి ఉండవల్లికి చెందిన పగడాల ప్రసన్న మరణించగా రూ.5లక్షల బీమా చెక్కును మృతుని కుటుంభసభ్యులకు అందజేశారు. చిల్లపల్లి శ్రీనివాసరావు, సామల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com