శ్రీశైలం ప్రాజెక్టులోకి 7 లక్షల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం

శ్రీశైలం ప్రాజెక్టులోకి 7 లక్షల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం
భారీ వర్షాల కారణంగా కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదిపై నిర్మించిన ప్రాజెక్టులు భారీ ప్రవాహంతో పోటెత్తుతున్నాయి. నదీ పరివాహప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి..

భారీ వర్షాల కారణంగా కృష్ణానది ఉధృతంగాప్రవహిస్తోంది. దీంతో నదిపై నిర్మించిన ప్రాజెక్టులు భారీ ప్రవాహంతో పోటెత్తుతున్నాయి. నదీ పరివాహప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. నదిపై నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టులోకి 7 లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహం కొనసాగుతోంది. వరుసగా నాలుగు రోజులనుంచి వరద ప్రవాహం కొనసాగుతోందని అధికారులు తెపుతున్నారు. 7లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టుకు వస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో విద్యుదుత్పత్తితోపాటు... గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సంవత్సరం ఆగస్టు రెండోవారం నుంచి ఇప్పటివరకు శ్రీశైలం ప్రాజెక్టునుంచి 50 రోజులకు పైగా స్పిల్‌వే ద్వారా నీటిని విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో అక్టోబర్ మాసంలో ఇంత భారీ స్థాయిలో వరద ప్రవాహం రావడంఓ చాలా అరుదని అంటున్నారు. కుంభవృష్టి వర్షాలతో కృష్ణానదితో పాటు బీమా, తుంగభద్ర నదుల నుంచీ భారీ ప్రవాహం కొనసాగుతోంది. గత కొద్దిరోజులునుంచి అత్యధిక ప్రవాహం కొనసాగుతుండగా... ఎందులోనూ నిల్వ చేయడానికి అవకాశం లేకుండా మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో బ్యాక్‌వాటర్‌ ప్రభావంతో కల్వకుర్తి పంపుహౌస్‌ కూడా నీటమునిగింది. నాగార్జునసాగర్‌, పులిచింతల కూడా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. దీంతో ప్రకాశం బ్యారేజి నుంచి 6.82 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. ఇప్పటివరకు 910 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లింది.

ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి 4 లక్షల 94వేల 634 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండటంతో గేట్లనుఎత్తి నీటిని నాగార్జున సాగర్‌కు నీటిని విడుదలచేస్తున్నారు. దీంతో జలాశయం నీటిమట్టం 884.40 అడుగులు, నీటినిల్వ సామర్థ్యం 211.95 టీఎంసీలుగా నమోదైంది. నాగార్జునసాగర్‌ నుంచి 5.40 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పులిచింతల నుంచి 5లక్షల ,62వేల 371 క్యూసెక్కులు నీటిని వదులుతున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.30అడుగులకు చేరుకుంది. సాగర్‌ నుంచి మొత్తం 5.39 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 4.90 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో 43 గేట్ల ద్వారా 4.65 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేశారు. కృష్ణానదిపై ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 1.69 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో నారాయణపూర్‌ జలాశయానికి 1.96 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. అక్కడి నుంచి జూరాలకు 2 లక్షల క్యూసెక్కులను విడుదల చేశారు.

Tags

Read MoreRead Less
Next Story