PADMA: పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 సంవత్సరానికి గానూ పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో పలు రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. క్రీడా, కళా, వ్యవసాయం, వైద్య రంగాల్లో సేవలందించిన ప్రముఖులను కేంద్రం ఎంపిక చేయగా.. ఆయా రంగాల్లో వారు చేసిన సేవలను పరిగణలోకి తీసుకుని.. పద్మశ్రీ, పద్మ భూషన్, పద్మ విభూషన్ అవార్డులకు ఎంపిక చేసింది.
ఏడుగురికి పద్మవిభూషణ్..
తెలంగాణకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డిని ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మ విభూషణ్ వరించింది. తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ నటుడు, శాసన సభ్యుడు బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. తెలంగాణకు చెందిన మాదిగ రిజర్వేషన్ ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ అవధాన విద్వాంసుడు మాడుగుల నాగఫణిశర్మ, ప్రముఖ విద్యావేత్త, రచయిత కేఎల్ కృష్ణ, కళారంగానికి చెందిన మిరియాల అప్పారావు, విద్యారంగానికి చెందిన వాధిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖిలకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. ఈ ఏడాదికి ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.
సుజకీ చైర్మన్‌కి కూడా..
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్‌సింగ్ ఖెహర్, ఇటీవల మరణించిన ప్రముఖ మళయాళీ రచయిత వాసుదేవన్ నాయర్, ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ఎల్.సుబ్రమణ్యం, కథక్ నృతకారిణి కుముదిని లఖియా, ప్రముఖ జానపద గాయని శారాదా సిన్హా, జపాన్‌కు చెందిన వ్యాపార వేత్త, సుజుకీ మోటార్ చైర్మన్ ఒసామా సుజుకీ(మరణానంతరం)కి పద్మ విభూషణ్ పురస్కారాలు లభించాయి.
పద్మ అవార్డులకు ఎంపికైన ప్రముఖులు జాబితా ఇది:
విలాస్ దాంగ్రే (హోమియోపతి వైద్యుడు) - మహారాష్ట్ర
వెంకప్ప అంబానీ సుగటేకర్ (జానపద గాయకుడు) - కర్ణాటక
నిర్మలా దేవి (చేతి వృత్తులు) - బిహార్
జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు)- అస్సాం
జోనస్ మాశెట్టి (వేదాంత గురు) బ్రెజిల్
హర్వీందర్‌సింగ్ (పారాలింపియన్ గోల్డ్‌మెడల్ విన్నర్) హరియాణా
భీమ్ సింగ్ భవేష్ (సోషల్‌వర్క్) బిహార్
పి.దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు) పుదుచ్చేరి
ఎల్.హంగ్‌థింగ్ (వ్యవసాయం-పండ్లు) నాగాలాండ్
సురేశ్ సోనీ (సోషల్‌వర్క్- పేదల వైద్యుడు)- గుజరాత్
రాధా బహిన్ భట్ (సామాజిక కార్యకర్త)- ఉత్తరాఖండ్
పాండి రామ్ మాండవి (కళాకారుడు) - ఛత్తీస్‌గఢ్
లిబియా లోబో సర్దేశాయ్ (స్వాతంత్ర్య సమరయోధురాలు) - గోవా
బేరు సింగ్ చౌహాన్ (జానపద గాయకుడు) - మధ్యప్రదేశ్
షేఖా ఎ.జె. అల్ సబాహ్ (యోగా)- కువైట్
నరేన్ గురుంగ్ (జానపద గాయకుడు) - నేపాల్
హరిమన్ శర్మ (యాపిల్ సాగుదారు) - హిమాచల్ ప్రదేశ్
జుమ్దే యోమ్‌గామ్ గామ్లిన్ (సామాజిక కార్యకర్త)- అరుణాచల్ ప్రదేశ్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com