ఆరు హత్య కేసుల్లో నిందితుడిని కేతిరెడ్డి పక్కనపెట్టుకున్నాడు: శ్రీరామ్

ఆరు హత్య కేసుల్లో నిందితుడిని కేతిరెడ్డి పక్కనపెట్టుకున్నాడు: శ్రీరామ్
వైసీపీ పాలన దుర్మార్గంగా ఉందని పరిటాల శ్రీరామ్ అన్నారు. తుమ్మల ఘటనలో గాయపడ్డ జవాన్‌ సమరసింహారెడ్డిని పరామర్శించిన పరిటాల

వైసీపీ పాలన దుర్మార్గంగా ఉందని పరిటాల శ్రీరామ్ అన్నారు. తుమ్మల ఘటనలో గాయపడ్డ జవాన్‌ సమరసింహారెడ్డిని పరామర్శించిన పరిటాల శ్రీరామ్... జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ కామిరెడ్డిపల్లి సుధాకర్‌పై విమర్శలు గుప్పించారు. ఒక ఊరు జాతరకు తనను ఆహ్వానిస్తే కక్ష కడతారా? అని ప్రశ్నించారు. వాహనం అడ్డు తీయమన్నందుకు.. ఆర్మీ జవాన్‌ పై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జవాన్‌పై దాడి చేసిన వ్యక్తి జడ్పీ వైస్‌ ఛైర్మన్‌గా అర్హుడా? అని నిలదీశారు. బాలింతను హత్య చేసిన చరిత్ర సుధాకర్‌ది అని..ఆరు హత్య కేసుల్లో నిందితుడిని ఎమ్మెల్యే కేతిరెడ్డి పక్కన పెట్టుకున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి, కేతిరెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story