గాల్లోనే కలిసిన ప్రాణాలు

గాల్లోనే కలిసిన ప్రాణాలు
షార్జా నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన వృద్ధ ప్రయాణికుడు మార్గమధ్యలో అస్వస్థతకు గురయ్యాడు

షార్జా నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన వృద్ధ ప్రయాణికుడు మార్గమధ్యలో అస్వస్థతకు గురయ్యాడు. మరికొద్ది సేపట్లో విమానాశ్రయం చేరుకుంటామనుకున్న సమయంలో ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు విమానాశ్రయానికి చేరుకోగానే హుటాహుటిన ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో సదరు ప్రయాణికుడు మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు ఏలూరు జిల్లా నిడదవోలుకు చెందిన చెక్కా నూకరాజు(85)గా గుర్తించారు. అయితే అతడి మృతదేహాన్ని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతడి కుటుంబ సభ్యలకు అధికారులు సమాచారం అందజేశారు.

Tags

Read MoreRead Less
Next Story