Pattabhi: మెడికల్ కాలేజీల ఏర్పాటుపై జగన్‌వి అన్నీ అబద్ధాలే: పట్టాభి

Pattabhi: మెడికల్ కాలేజీల ఏర్పాటుపై సీఎం జగన్ నిండు సభలో నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారన్నారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశానని చెప్పడం పచ్చి అబద్ధం అన్నారు. మెడికల్ కాలేజీలపై కేంద్రానికి పంపిన అప్లికేషన్లు ఏడు మాత్రమేనని చెప్పుకొచ్చారు.
వాటిలో నాలుగు అప్లికేషన్లను కేంద్రం తిరస్కరించిందని, అనుమతులు వచ్చింది కేవలం మూడు మెడికల్ కాలేజీలేనని అన్నారు. ఆ మూడు మెడికల్ కాలేజీల్లోనూ ఒక్కదానికీ ఇటుక కూడా వేయలేదంటూ విమర్శించారు. రాష్ట్రంలో అసలు ఆరోగ్యశ్రీ అమలవుతోందా అని ప్రశ్నించారు.
సీఎం సొంత జిల్లా కడపలోనే ఆరోగ్యశ్రీ అమలవడం లేదన్నారు. ఇక మెడికల్ డివైజెస్ అసోసియేషన్ అయితే.. రాష్రానికి రెడ్ నోటీస్ ఇచ్చిందన్నారు. జగన్ సర్కార్ బిల్లులు చెల్లించడం లేదు కాబట్టి.. మెడికల్ డివైజ్‌లు సరఫరా చేయొద్దంటూ అసోసియేషన్ తీర్మానించిన విషయాన్ని వెల్లడించారు.
మెడికల్ కాలేజీలపై సీఎం జగన్ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారు: పట్టాభి
17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశానని జగన్ చెప్పడం పచ్చి అబద్ధం
మెడికల్ కాలేజీలపై కేంద్రానికి పంపిన అప్లికేషన్లు 7 మాత్రమే: పట్టాభి
7 దరఖాస్తులలో నాలుగు అప్లికేషన్లను కేంద్రం తిరస్కరించింది
కేంద్రం నుంచి అనుమతులు వచ్చింది కేవలం మూడింటికి మాత్రమే: పట్టాభి
మూడు మెడికల్ కాలేజీల్లోనూ ఒక్కదానికీ ఇటుక పడలేదని విమర్శ
రాష్ట్రంలో అసలు ఆరోగ్యశ్రీ అమలవుతోందా అని టీడీపీ ప్రశ్న
సీఎం సొంత జిల్లా కడపలోనే ఆరోగ్యశ్రీ అమలవడం లేదన్న పట్టాభి
మెడికల్ డివైజెస్ అసోసియేషన్ ఏపీకి రెడ్ నోటీస్ ఇచ్చిందని విమర్శలు
జగన్ సర్కార్ బిల్లులు చెల్లించనందున..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com