PAWAN: అడవి తల్లి బాటలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్

PAWAN: అడవి తల్లి బాటలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
X
డోలీ మోతల రహిత మన్యమే లక్ష్యం.. గిరిజన ప్రాంతాల్లో నూతన రోడ్ల నిర్మాణం... వేగంగా రూ.1005 కోట్లతో భారీ ప్రాజెక్ట్‌

ఆ ప్రాం­తాల ప్ర­జ­లు ఎన్నే­ళ్లు­గా ఎదు­రు­చూ­స్తు­న్న రో­డ్డు సౌ­క­ర్యం... ఇప్పు­డి­ప్పు­డే అంది వస్తోం­ది. కొం­డ­లు, అడ­వు­లు, లోయల మధ్య ఉంటూ రో­డ్డు అనే మాట విని కూడా చూ­డ­ని గి­రి­జన ఆవా­సాల జీ­వి­తం ఇప్పు­డి­ప్పు­డే మా­రు­తోం­ది. ఒక ని­ర్ణ­యం, ఒక ప్ర­ణా­ళిక ఇప్పు­డు వా­రి­ని అభి­వృ­ద్ధి ది­శ­గా నడి­పిం­చ­బో­తుం­ది. ఈ ప్ర­ణా­ళిక పూ­ర్త­య్యే సరి­కి, ఆ ప్రాం­తాల ప్ర­జ­ల­కు ఇది ని­జ­మైన పం­డు­గ­వ­లె మా­ర­నుం­ది. ఆ ని­ర్ణ­యం తీ­సు­కు­ని ముం­దు­కు సా­గు­తు­న్నా­రు డి­ప్యూ­టీ సిఎం పవన్ కళ్యా­ణ్. అడవి తల్లి బాట పే­రు­తో డోలి మోతల రహిత మన్య­మే లక్ష్యం­గా ముం­దు­కు సా­గు­తు­న్నా­రు. పవన్ కళ్యా­ణ్ ఆది­వా­రం మధ్యా­హ్నం గి­రి­జన ప్రాం­తా­ల్లో రహ­దా­రి పనుల పు­రో­గ­తి­పై ఉన్న­తా­ధి­కా­రు­ల­తో టెలీ కా­న్ఫ­రె­న్స్ ని­ర్వ­హిం­చా­రు. ఇం­దు­లో ‘అడవి తల్లి బాట’ పే­రు­తో చే­ప­ట్టిన నూతన రహ­దా­రుల ని­ర్మా­ణా­న్ని వే­గ­వం­తం చే­యా­ల­ని స్ప­ష్ట­మైన ఆదే­శా­లు జారీ చే­శా­రు. ఈ పను­లు పూ­ర్త­యి­తే 625 గి­రి­జన ఆవా­సా­ల­కు రహ­దా­రి సౌ­క­ర్యం అం­ద­నుం­ది. ఈ ప్ర­తి­ష్టా­త్మక ప్రా­జె­క్ట్ పీఎం జన్ మన్ పథకం, మహా­త్మా­గాం­ధీ జా­తీయ గ్రా­మీణ ఉపా­ధి హామీ పథకం, ఉప ప్ర­ణా­ళిక ని­ధు­లు కలి­పి మొ­త్తం రూ. 1005 కో­ట్ల­తో చే­ప­ట్ట­బ­డిం­ది. స్వా­తం­త్ర్యం వచ్చి­న­ప్ప­టి నుం­డి ఇప్ప­టి­వ­ర­కు రహ­దా­రి సౌ­క­ర్యం లేని ఆవా­సా­ల­ను కూడా అను­సం­ధా­నిం­చే­లా రెం­డు దశ­ల్లో ఈ పను­లు కొ­న­సా­గు­తు­న్నా­యి.

పవన్ కీలక ఆదేశాలు

గి­రి­జన ప్రాం­తా­ల్లో ‘అడవి తల్లి బాట’ పే­రిట చే­ప­ట్టిన నూతన రహ­దా­రుల ని­ర్మా­ణా­న్ని వే­గ­వం­తం చే­యా­ల­ని ఏ పవన్ కల్యా­ణ్ ఆదే­శిం­చా­రు. ఈ పను­ల్లు త్వ­రి­త­గ­తిన పూ­ర్తి చే­స్తే 625 గి­రి­జన ఆవా­సా­ల­కు మె­రు­గైన రహ­దా­రి సౌ­క­ర్యం ఏర్ప­డు­తుం­ద­ని అన్నా­రు. అధి­కా­రు­ల­తో సమీ­క్ష ని­ర్వ­హిం­చన పవన్... డోలీ మోతల రహిత మన్య­మే లక్ష్యం­గా ముం­దు­కు సా­గా­లా­ని ఆదే­శిం­చా­రు. రెం­డు వా­రా­ల­కో­సా­రి శా­ఖా­ప­రం­గా సమీ­క్షిం­చి ని­ర్మాణ పు­రో­గ­తి­పై ని­వే­దిక ఇవ్వా­ల­ని అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. గి­రి­జన ప్రాం­తా­ల్లో రహ­దా­రి పనుల స్థి­తి­గ­తు­ల­పై పం­చా­య­తీ­రా­జ్ గ్రా­మీ­ణా­భి­వృ­ద్ధి ము­ఖ్య కా­ర్య­ద­ర్శి, కమి­ష­న­ర్, ఇం­జి­నీ­రిం­గ్ అధి­కా­రు­ల­తో పవ­న్‌ టెలీ కా­న్ఫ­రె­న్స్ ని­ర్వ­హిం­చా­రు. పీఎం జన్ మన్ పథ­కం­తో పాటు మహా­త్మా­గాం­ధీ జా­తీయ గ్రా­మీణ ఉపా­ధి హామీ పథకం, ఉప ప్ర­ణా­ళిక ని­ధు­లు కలి­పి రూ.1005 కో­ట్ల­తో గి­రి­జన ప్రాం­తా­ల్లో రహ­దా­రుల ని­ర్మా­ణం చే­ప­ట్టా­మ­న్నా­రు. గి­రి­జన ప్రాం­తా­ల్లో ఈ పనుల గు­రిం­చి స్థా­ని­కు­ల­కు తె­లి­య­జే­య­డం ఎంతో అవ­స­ర­మ­ని పవన్ అన్నా­రు. డో­లీ­ర­హిత ఆవా­సా­లు ఉం­డా­ల­నే సం­క­ల్పం­తో చే­ప­ట్టిన వి­ష­యా­న్ని వా­రి­కీ చె­ప్పా­ల­ని తద్వా­రా వారి సహ­కా­రం, ప్రో­త్సా­హం కూడా లభి­స్తుం­ద­ని చె­ప్పా­రు.

Tags

Next Story