Pawan Kalyan: ప్యాకేజీ స్టార్ అని ఎవరైనా అంటే.. : వైసీపీ నేతలపై పవన్ ఫైర్

Pawan Kalyan: జనసేన కార్యకర్తల సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. వైసీపీ నేతలనుద్దేశించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంతకాలం తన సహనమే వైసీపీ నేతలను కాపాడిందంటూ ఫైర్ అయ్యారు జనసేనాని. ప్యాకేజీ స్టార్ అని ఎవరైనా మాట్లాడితే దవడ వాచిపోయేలా కొడతానంటూ హెచ్చరించారు.
తన సంపాదన ఎంతో తెలుసా అంటూ ప్రశ్నించారు. వెదవల్లారా...సన్నాసుల్లారా అంటూ వైసీపీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానంటూ తన కాలి చెప్పు తీసి చూపించారు. మెడ పిసికి చంపేస్తానంటూ తీవ్రంగా హెచ్చరించారు.
తాను విడాకులు ఇచ్చే మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని చెప్పారు. మీ లాగా ఒక పెళ్లి చేసుకుని 30 మందితో తిరగట్లేదని వైసీపీ నేతలనుద్దేశించి కామెంట్ చేశారు. వైసీపీ గూండాలు ఎంతమంది వస్తారో..రండి చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు. ఇవాల్టి నుంచి ఇక యుద్ధమే అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాళ్ల, రాడ్ల దేనితోనైనా సిద్ధమేనన్నారు.
ఇప్పటివరకు తనలో శాంతి, సహనం మాత్రమే చూశారని చెప్పారు. నాకు రాజకీయం తెలియదనుకుంటున్నారా అంటూ రెచ్చిపోయారు పవన్ కల్యాణ్. బూతుల పంచాంగం విప్పితే నిలబెట్టి తోలుతీస్తా అంటూ హెచ్చరించారు. బాపట్లలో పెరిగానని...గొడ్డు కారం తిని పెరిగానంటూ చెప్పారు. వైసీపీలో అందరూ నీచులు కాదని..కానీ నీచుల సంఖ్య ఎక్కువన్నారు. ప్రసంగంలో భాగంగా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై సెటైర్లు వేశారు. బంతి, చామంతి అంటూ అవంతిపై పరోక్షంగా విమర్శించారు.
అన్ని కులాలకు అధికారం దక్కాలన్నారు పవన్ కల్యాణ్. ఒక కులం వల్ల అభివృద్ధి సాధ్య కాదన్నారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించిందన్నారు. మాట్లాడితే రాయలసీమ వెనుకబాటుతనం అంటున్నారని.........రాయలసీమను వెనకబాటు తనానికి కారణమేవర్రా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రులంతా సీమకు చెందినవారే కదా అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com