AP: రేషన్ బియ్యం అక్రమ రవాణపై పవన్ సీరియస్‌

AP: రేషన్ బియ్యం అక్రమ రవాణపై పవన్ సీరియస్‌
X
నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్న డిప్యూటీ సీఎం... పోర్టు దగ్గర సెక్యూరిటీ సరిగ్గా లేదని ఆవేదన

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రూపాయి ఖర్చు లేకుండా కొందరు వేల కోట్లు సంపాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టును సందర్శించిన పవన్.. ఈ అక్రమ సరఫరా వెనక ఎవరు ఉన్నా వదిలి పెట్టబోమన్నారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. పోర్టు దగ్గర సెక్యూరిటీ సరిగ్గా లేదని, ఇది దేశ భద్రతకు ముప్పు తెస్తుందని అన్నారు. ఏపీలో రేషన్ బియ్యం సరఫరా వెనక బలమైన మాఫీయా ఉందని పవన్ అన్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న తనకే పోర్టు అధికారులు సహకరించలేదని అన్నారు. కాకినాడ పోర్టును సందర్శించిన పవన్.. అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడీఎస్ బియ్యాన్ని ఇక్కడి నుంచి తరలించి ఆఫ్రికా దేశాల్లో రూ. 70కు అమ్మేస్తున్నారని అన్నారు. తప్పు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని హెచ్చరించారు.

ప్రధానికి లేఖ సిద్ధం చేయండి: పవన్

కాకినాడలో అక్రమ రవాణా కార్యకలాపాలపై ప్రధాని మోడీకి, హోంమంత్రి అనితకు లేఖలు సిద్ధం చేయాల్సిందిగా వ్యక్తిగత కార్యదర్శిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ‘పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు, భవిష్యత్తులో పేలుడు పదార్థాలు అక్రమ రవాణా జరగవని గ్యారంటీ ఏంటి?’ అని ప్రశ్నించారు. అక్రమ దందా విషయంలో యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది దేశ భద్రతకే ముప్పుగా మారే అవకాశముందన్నారు.


టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ సీరియస్

కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్ల ముందే ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును ప్రశ్నించారు. ఇటు పోర్టు అధికారులపై మండిపడ్డ పవన్.. కూటమి ప్రభుత్వంలో అక్రమ రవాణా కొనసాగితే సహించనని వార్నింగ్ ఇచ్చారు. పోర్టులో ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే.

కాన్వాయ్‌ ఆపి వినతిపత్రం తీసుకున్న పవన్

పిఠాపురంలోని అగ్రహారానికి చెందిన ప్రభుత్వ పట్టా భూముల్లో నివాసం ఉంటున్న వారి నుండి టౌన్ ప్లాన్ సెక్రెటరీ ఫాతిమా డబ్బులు వసూలు చేస్తోందంటూ బాధితులు ధర్నా చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటుగా వస్తున్నారని సమాచారంతో రోడ్డుపై ఫ్లెక్సీ పట్టుకొని నిలబడగా.. వారిని చూసిన పవన్ వారి దగ్గరకు వచ్చి వివరాలను అడిగి తెలుసుకుని న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు.

Tags

Next Story