Pawan Kalyan : పవన్ కళ్యణ్ ఏపీ పర్యటన వాయిదా..

Pawan Kalyan : పవన్ కళ్యణ్ ఏపీ పర్యటన వాయిదా..
X
Pawan Kalyan : అక్టోబర్‌లో జనసేన అధినేత తలపెట్టిన ఏపీ వ్యాప్త పర్యటన వాయిదా పడింది

Pawan Kalyan : అక్టోబర్‌లో జనసేన అధినేత తలపెట్టిన ఏపీ వ్యాప్త పర్యటన వాయిదా పడింది.అయితే జనసేన-జనవాణి,కౌలు రైతుల భరోసా యాత్ర పూర్తి చేస్తామన్నారు జనసేనాని. అన్ని రకాలుగా ఆలోచన చేసిన తరువాతే అక్టోబరులో చేపట్టాల్సిన యాత్రను కొన్నాళ్ల పాటు వాయిదా వేస్తున్నామని తెలిపారు.ఈ మధ్య కాలంలో పార్టీ సన్నద్ధతపై దృష్టి పెడుతామని అన్నారు.

వచ్చే నెల నుంచి ప్రతి అసెంబ్లీ సెగ్మెంటు వారిగా సమీక్షలు చేపడతామని.జనసేనకు ఆదరణ పెరుగుతోందని సర్వేల్లో తేలిందన్న పవన్‌ కళ్యాణ్‌ ఏపీలో అధికార దుర్వినియోగం ఎక్కువగా ఉందని సోషల్ మీడియాలో చిన్న పోస్టింగులు పెట్టినా కేసులు పెట్టేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45 నుంచి 67 స్థానాలకే పరిమితం కానుందన్నారు పవన్‌ కళ్యాణ్‌ప్రతి దానికీ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని అలాగే మనిషికి, అధికారానికి కూడా ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుందని అన్నారు పవణ్‌ కళ్యాణ్‌.

Tags

Next Story