పవన్ కళ్యాణ్‌ను గ్రామంలోకి రానివ్వకుండా వైసీపీ కార్యకర్తల యత్నం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పోయ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు అక్కడ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. పవన్‌ను గ్రామంలో రానివ్వకుండా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అటు జనసేన కార్యకర్తలు కూడా భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. జనసేన, వైసీపీ కార్యకర్తల తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. అయితే పోలీసుల అక్కడే ఉండి చోద్యం చూస్తున్నారే కానీ పట్టించుకోవడంలేదని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story