PAWAN: చంద్రబాబు బలమైన నాయకుడు

జనసేన ఆవిర్భావ సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పవన్ ప్రశంసలు కురిపించారు. టీడీపీల కష్టాలు ఉన్నప్పుడు చేయి అందించామని.. అది గుర్తుపెట్టుకుని డిప్యూటీ సీఎంగా కలిసి ఒక వ్యక్తితో బలంగా ప్రయాణం చేస్తున్నానని పవన్ అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు, హైటైక్ సిటీకి రూపకల్పన చేసిన దార్శనికుడు చంద్రబాబు అని పవన్ కొనియాడారు. క్లెమోర్ మైన్స్‌తో పేల్చేస్తే.. తర్వాతి రోజు చొక్కా దులుకుని వచ్చి డ్యూటీలో చేరిన బలమైన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని. ఆయనకు, లోకేశ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు అని పవన్ సభా వేదికగా వెల్లడించారు.
నా రక్తంలో సనాతనం ఉంది..
సనాతన ధర్మం తన రక్తంలోనే ఉందని పవన్ అన్నారు. 14 ఏళ్ల నుంచి దీక్షలు చేస్తున్నానని... అయ్యప్పస్వామి దీక్షా చేశానని గుర్తు చేశారు. సనాతన ధర్మంపై తనకు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. 219 దేవాలయాలను అపవిత్రం చేస్తే.. అంతర్వేది రథాన్ని కాల్చేస్తే.. రాముల వారి విగ్రహం నుంచి శిరసును వేరే చేస్తే ఎందుకు బయటకు రాలేదంటున్నారని.. కానీ ఆ రోజే వాటిపై స్పందించానని గుర్తు చేశారు. రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటే ఎలా..? మహ్మద్ ప్రవక్తను దూషించి బతకగలరా..? ఏసుక్రీస్తు, మేరీమాతను అనగలరా..? అని పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. 15 నిమిషాలు పోలీసులు కళ్లు మూసుకుంటే హిందువులకు తామంటే ఏమిటో చూపిస్తామంటూ ఓల్డ్ సిటీలో నాయకులు అంటే తప్పు పట్టకూడదా..? అని అక్బరుద్దీన్ వ్యాఖ్యలను పవన్ గుర్తు చేశారు.
చంటి సినిమాలో హీరోయిన్‌లా పెంచారు
తాను సగటు మధ్య తరగతి మనిషిని అని... కోట్లు సంపాదించాలని.. పేరు రావాలని ఎప్పుడూ ఆశించలేదని పవన్ అన్నారు. సినిమాలను కాదు, సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని పెరిగినవాణ్ని తెలిపారు. చంటి సినిమాలో మీనాలా తనను పెంచారన్న పవన్.. ఇంటికి ఆలస్యంగా వచ్చినా కంగారుపడేవారన్నారు. మూడు సినిమాలు.. తొలిప్రేమ హిట్ వచ్చిన తర్వాత కూడా రాత్రి ఇంటికి ఆలస్యంగా వెళ్తే ఎందుకింత లేటయిందని నాన్న తిట్టేవారని అనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెరిగిన నేను సినిమాల్లోకి, రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదన్నారు.
గద్దరన్న పరిచయం అలా..
‘ఖుషి’ సినిమా వల్ల గద్దరన్న పరిచయం అయ్యారని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. 'సగటు మధ్యతరగతి మనిషిగా బతకడమే నా కోరిక. చంటి సినిమాలో మీనాను పెంచినట్టు నన్ను పెంచారు. అలాంటి నేను సినిమాలు చేస్తానని, రాజకీయాల్లోకి వస్తానని ఎవరూ ఊహించి ఉండరు.' అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com