PAWAN: మార్క్ శంకర్‌తో కలిసి హైదరాబాద్‌కు పవన్

అగ్ని ప్రమాదంలో గాయపడిన కుమారుడు మార్ శంకర్‌తో కలిసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్ చేరుకున్నారు. కోలుకున్న మార్క్ శంకర్‌ను పవన్ కల్యాణ్ దంపతులు హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. కుమారుడిని ఎత్తుకుని పవన్ దంపతులు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పవన్ దంపతులు మార్క్ శంకర్‌ను హైదరాబాద్ తీసుకవచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో డిప్యూటీ సీఎం స్వయాన తన కొడుకు మార్క్ శంకర్‌ను భుజాన ఎత్తుకొని వచ్చారు. అయితే, అతనితోపాటు అన్నా లెజీనోవా, కూతురు కూడా కనిపిస్తున్నారు.
అగ్నిప్రమాదంలో గాయాలు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొడుకు ఈ నెల 9వ తేదీ సింగపూర్ స్కూల్‌లో అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మార్క్ శంకర్ చేతులకు , కాళ్లకు గాయాలు అయ్యాయి. అంతేకాదు మంటల వల్ల పొగ మార్క్ ఊపిరితిత్తులకు చేరడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో సింగపూర్‌లోనే ఆసుపత్రిలో మార్క్‌కు మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతం మార్క్ శంకర్ కోలుకున్నాడని చిరంజీవి కూడా ఇటీవల పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. తమతో పాటు తమ అభిమానులు మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రార్థనలు చేశారు ధన్యవాదాలు కూడా తెలియజేశారు. ఆంజనేయ స్వామి దయవల్ల పెద్ద గండం నుంచి బయటపడ్డాడని ఆయన పోస్ట్ పెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com