Pawan Kalyan: గుంతలు పూడ్చలేని మీరు.. ఇళ్లను కూలుస్తారా: జగన్ సర్కార్‌పై పవన్ ఫైర్

Pawan Kalyan: గుంతలు పూడ్చలేని మీరు.. ఇళ్లను కూలుస్తారా: జగన్ సర్కార్‌పై పవన్ ఫైర్
X
Pawan Kalyan: వైసీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తే.. ఇడుపులపాయ నుంచి హైవే వేస్తామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

Pawan Kalyan: వైసీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తే.. ఇడుపులపాయ నుంచి హైవే వేస్తామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఇక వైసీపీ ప్రభుత్వాన్ని కూలదొబ్బడమే అని అన్నారు. గుంతలు పూడ్చలేని మీరు.. ఇళ్లను కూల్చుతారా అంటూ ప్రశ్నించారు. రేప్‌లు చేసిన వారిని రక్షించి.. సామాన్యులపై ప్రతాపం చేపిస్తారా అని నిలదీశారు. పవన్ కల్యాణ్ ఇప్పటంలో గ్రామంలో పర్యటిస్తూ కూల్చేసిన ఇళ్లను పరిశీలించారు.


పవన్ కల్యాణ్ గ్రామంలో నడి రోడ్డుపై కూర్చొని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. గాంధీ, నెహ్రూ విగ్రహాలను కూల్చేసిన వైసీపీ ప్రభుత్వం.. వైఎస్సార్ విగ్రహాన్ని మాత్రం కూల్చదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ విగ్రహం రోడ్డుకు అడ్డంగా లేదా అని పవన్ ప్రశ్నించారు.


పవన్ కల్యాణ్ గ్రామంలో కలిగయ తిరుగుతూ కూల్చేసిన ఇళ్లను పరిశీలించారు. కోల్పోయిన బాధితులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బాధితులు పవన్ వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. కావాలనే కక్ష కట్టి తమ ఇళ్లను కూల్చేస్తున్నారని ఆవేదన చెందారు.


ఇక అంతకుముందు మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ఇప్పటం బయలుదేరిన పవన్ కల్యాణ్ వాహానాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పవన్ కల్యాణ్ వాహనం దిగి కొద్ది దూరం నడిచారు. కొద్ది దూరం నడిచాక మరో వాహనంలో ఇప్పటం చేరుకున్నారు.

Tags

Next Story