Pawan Kalyan: పవర్ స్టార్ ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్

Pawan Kalyan: పవర్ స్టార్ ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్
ప్రజల కష్టాలకు ఇప్పటి వైసీపీ ప్రభుత్వమే కారణమన్న ఆయన... జగన్ ప్రభుత్వం పోతేగాని ప్రజలకు మంచిరోజులు రావన్నారు

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ ను ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పునస్కరించుకుని ఇన్‌స్టాలోకి వచ్చారు. జనకళ్యాణమే తన లక్ష్యంగా సాగుతోన్న పవన్ ఆంద్రదేశమంతా కలియ తిరుగుతున్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తన ప్రచార రథం వారాహిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటి ప్రభుత్వంపై తన విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టిన ఆయన.. హలో ఏపీ బైబై వైసీపీ అంటూ గర్జిస్తున్నారు.

ప్రజల కష్టాలకు ఇప్పటి వైసీపీ ప్రభుత్వమే కారణమన్న ఆయన... జగన్ ప్రభుత్వం పోతేగాని ప్రజలకు మంచిరోజులు రావన్నారు. ప్రజలకు మంచిచేయడానికి విపక్షాలను కలుపుకు వెళ్లాలడమే తన లక్ష్యమని అన్నారు. అయితే ఇప్పటికైతే తాను ఏపార్టీతో జట్టుకడతాడని తెలుపలేదు. కాగా టీడీపీ, బీజేపీతో పవన్ ఉమ్మడిగా పోటీ చేస్తాడని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే కళ్యాణ్ ట్విట్టర్ లో ఉన్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో ఎకౌంట్ ఓపెన్ చేయడంతో జనసేన కార్యకర్తలు ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇకపై తన సోషల్ మీడియా వార్ ఇన్‌స్టాలో కూడా ఉండటంతో పవర్ స్టార్ అభిమానులు భారీగా ఇందులో ఎకౌంట్స్ ను ఓపెన్ చేసుకుంటున్నారు. ఈ రోజే ఎకౌంట్ ను ఓపెన్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పటివరకైతే పోస్ట్ చేయలేదు. ఆయన మొదటి పోస్ట్ కోసం తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

https://www.instagram.com/pawankalyan/

Tags

Next Story