Pawan Kalyan: క్యాబ్ డ్రైవర్ల కు అండగా పవన్ కల్యాణ్

Pawan Kalyan: క్యాబ్ డ్రైవర్ల కు అండగా పవన్ కల్యాణ్
X
పవన్‌ను కలిసిన ఏపీ క్యాబ్ డ్రైవర్లు..

ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ విడిచి వెళ్లాలనడం భావ్యం కాదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను క్యాబ్‌ డ్రైవర్లు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు రెండూ ఒక్కటేనన్న భావన అందరిలో ఉండాలని చెప్పారు. ఇరు రాష్ట్రాల ప్రజల సఖ్యతే మనల్ని ప్రగతిలో ముందుకు నడిపిస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలు మెరుగైతే ఆంధ్ర నుంచి తెలంగాణకు వలసలు ఆగుతాయని చెప్పారు. ఫలితంగా తెలంగాణ ప్రజలకు వివిధ రకాల రంగాల్లో ఉపాధి మెరుగవుతుందని తెలిపారు. అక్కడి ప్రాంతం, ప్రజలు అభివృద్ధి బాటలో నడుస్తారని చెప్పారు.

హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్లను అడ్డుకోవడం వల్ల 2 వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనే సమస్య తన దృష్టికి వచ్చిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులు త్వరలోనే మొదలవుతాయి. మళ్లీ కార్యకలాపాలు మొదలు కానున్నాయని, ఇక్కడ కూడా తగిన అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఉమ్మడి రాజధాని గడవుకాలం అయిపోగానే ఆంధ్రప్రదేశ్ క్యాబ్ లు హైదరాబాద్ లో ఉండకూడదని అడ్డుకోవడం సబబు కాదని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. అందుకు అనుగుణంగా పలు సమస్యల పరిష్కార దిశగా పావులు కదుపుతోంది. ముఖ్యంగా ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని తెచ్చి ఆ సమస్య తీర్చింది. దీని వల్ల ప్రజలు సహా నిర్మాణ రంగ కార్మికులకు ఎంతో లబ్ధి చేకూరుతోంది. అలాగే అమరావతి రైతుల పోరాటాన్ని ప్రశంసిస్తూ వారికి తగిన న్యాయం చేస్తోంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి సమస్యలు విన్నవించేందుకు ప్రజలు భారీ ఎత్తున కూటమి ఎమ్మెల్యేలు, మంత్రుల వద్దకు క్యూ కడుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రతి రోజూ వందల కొద్ది అర్జీలు వస్తున్నాయి.

Tags

Next Story