PAWAN: పవన్ రియల్‌ లైఫ్‌లో "ఒకే ఒక్కడు ”

PAWAN: పవన్ రియల్‌ లైఫ్‌లో ఒకే ఒక్కడు ”
X

కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్వయంగా పరిశీలించిన వేళ.. అతని అభిమానులు ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. పవన్ రియల్ లైఫ్‌లో ‘ఒకే ఒక్కడు’ సినిమా చూపిస్తున్నాడని పొంగిపోతున్నారు. ఉపముఖ్యమంత్రి హోదాలో సినిమాలకు మించిన కిక్ అందిస్తున్నాడని అంటున్నారు. ‘ఒకే ఒక్కడు’లో హీరో అర్జున్‌లా, ‘భరత్ అనే నేను’లో మహేష్ బాబులా కనిసిస్తున్నాడంటూ ఆ వైబ్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.

సీజ్ ద షిప్.. నెట్టింట వైరల్‌

జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కాకినాడ పోర్టులో బియ్యం స్మగ్లింగ్ పై పరిశీలన చేయడానికి వెళ్లినప్పటి నుంచి ఒకే మాట ట్రెండ్ అవుతోంది. ఆ మాట సీజ్ ద షిప్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే మాట ట్రెండ్ అవుతోంది. ఇంకా చెప్పాలంటే విదేశీ సోషల్ మీడియా యూజర్లకు ఇదో మిస్టరీ అనిపించింది. అందుకే అసలేంటి ఈ సీజ్ ద షిప్ అని ఆరా తీయడం ప్రారంభించారు. పవన్ కల్యాణ్ క్రేజ్ అలా ఉంటుందని వారికి ఇప్పుడే తెలిసి ఉంటుంది.



Tags

Next Story