Pawan Kalyan Tweets : వైసీపీ సర్కార్‌పై పవన్ కల్యాణ్ సెటైరికల్ ట్వీట్లు..

Pawan Kalyan Tweets : వైసీపీ సర్కార్‌పై పవన్ కల్యాణ్ సెటైరికల్ ట్వీట్లు..
X
Pawan Kalyan Tweets : అవకాశం వచ్చినప్పుడల్లా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్వీట్లతో వైసీపీ సర్కార్‌ను టార్గెట్‌ చేస్తున్నారు

Pawan Kalyan Tweets : అవకాశం వచ్చినప్పుడల్లా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్వీట్లతో వైసీపీ సర్కార్‌ను టార్గెట్‌ చేస్తున్నారు.. నిన్నటికి నిన్న ఉత్తరాంధ్రలో వైసీపీ గర్జన సభకు పిలుపునివ్వడంపై తనదైన శైలిలో ప్రశ్నాస్త్రాలు సంధించగా.. తాజాగా మూడు రాజధానుల అంశంపై ట్విట్టర్‌ వేదికగా సెటైరికల్‌ కౌంటర్‌ ఇచ్చారు.. యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ ఆంధ్రగా పేర్కొంటూ 25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి 25 రాజధానులకు వెళ్లండంటూ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.. సర్వతోముఖాభివృద్ధికి మంత్రం వికేంద్రీకరణ అనుకుంటే మూడు రాజధానులే ఎందుకని ప్రశ్నించారు. ఏపీని వైసీపీ రాజ్యంగా మార్చుకోండంటూ అధికార పార్టీకి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు.

అంతకు ముందు కూడా వైసీపీని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు పవన్‌ కల్యాణ్‌.. అమెరికాలోని సౌత్‌ డకోటాలోని మౌంట్‌ రష్‌ మోర్‌ పర్వతాన్ని, విశాఖలోని రుషికొండను పోల్చుతూ కామెంట్ చేశారు.. మౌంట్‌ రష్‌ మోర్‌ ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛ-విశ్వాసాలకు చిహ్నంగా ఉంటే.. రుషికొండ పర్వత శ్రేణుల్లోని ది మౌంట్‌ దిల్‌ మాంగే మోర్‌ ధన వర్గ కుల స్వామ్యానికి చిహ్నంగా మారిందంటూ సెటైరికల్‌గా ట్వీట్‌ చేశారు.

Tags

Next Story