Pawan Kalyan Varahi Vehicle: ఊపిరి కూడా తీసుకోవద్దంటారా.. వైసీపీ నేతల తీరుపై పవన్ ఫైర్

Pawan Varahi Vehicle : ఎన్నికల యుద్ధానికి సిద్ధం అనే ట్యాగ్‌తో జనసేన సిద్ధం చేసిన పవన్‌కల్యాణ్ చైతన్యరథం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఆ చైతన్య రథానికి వేసిన రంగే దీనింతటికీ కారణం. వాహనానికి వేసిన ఆలీవ్ గ్రీన్ కలర్‌పై వైసీపీ నేతల నుంచి సెటైర్లు పేలుతుండగా.. దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జనసేన అధినేత పవన్.
ఇక కేంద్ర మోటారు వాహన నియమం 1989.. అధ్యాయం 121 ప్రకారం.. రక్షణశాఖకు చెందినవి మినహా ఏ మోటారు వాహనాలకు ఆలివ్ గ్రీన్ కలర్ పెయింట్ చేయరాదని హిమాచల్ ప్రదేశ్ లో కూడా కొన్ని వాహనాలకు అభ్యంతరం తెలిపిన నేపధ్యాన్ని గుర్తు చేస్తున్నారు.. కొన్ని ప్రాంతాల్లో కూడా వాహనాలకు ఆలివ్ గ్రీన్ కలర్ నిషేదం ఉందని చట్టాలు చెపుతున్నాయి.. అయితే జనసేన మాత్రం తాము అన్నీ చట్ట ప్రకారమే రూపొందించామని జనసేనను చూసి ప్రభుత్వానికి నిద్ర పట్టడం లేదని జనసేన PACఛైర్మన్ నాదేండ్ల మనోహర్ కామెంట్ చేశారు.
మరోవైపు కనీసం ఈ ఆలీవ్ కలర్ షర్ట్ అయినా వేసుకోవచ్చా? అంటూ వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. 'మొదట మీరు నా సినిమాలను అడ్డుకున్నారు. ఆ తరువాత విశాఖపట్నం పర్యటనకు వెళ్తే హోటల్ గది నుంచి బయటకు రానివ్వలేదు. మంగళగిరిలో పార్టీ ఆఫీస్ నుంచి బయటకు రాకుండా నా కారును అడ్డగించారు.
కనీసం నడిచి వెళ్దామంటే నడవనివ్వలేదు. ఇప్పుడు వాహనం రంగు సమస్యగా మారింది. తర్వాత నన్ను ఊపిరి కూడా తీసుకోవద్దంటారా చెప్పండి ఏం చేయాలో' అంటూ వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com