రేపే బహిరంగ సభ... వారాహి యాత్ర షురూ..

X
By - Bhoopathi |13 Jun 2023 3:15 PM IST
జనసేనాని వారాహి యాత్ర షెడ్యూల్ విడుదలైంది. అన్నవరం నుంచి వారాహి యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
జనసేనాని వారాహి యాత్ర షెడ్యూల్ విడుదలైంది. అన్నవరం నుంచి వారాహి యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రతి నియోజకవర్గంలోని ప్రజలతో పవన్ కళ్యాణ్ మమేకం కానున్నారు. ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకునేందుకు 'జనవాణి' నిర్వహించున్నారు. అన్నవరం నుంచి నరసాపురం వరకు షెడ్యూల్ ఖరారైంది.
రేపు కత్తిపూడిలో పవన్ తొలి బహిరంగ సభలో పాల్గొంటారు. జూన్ 16న పిఠాపురంలో వారాహి యాత్ర, సభ ఉంటుంది. 18న కాకినాడలో.. 20న ముమ్మిడివరంలో... 21న అమలాపురంలో.. 22న పి.గన్నవరం నియోజకవర్గం మీదుగా.. వారాహి యాత్ర, రాజోలు నియోజకవర్గం మకిలిపురంలో.. 23న నరసాపురంలో వారాహి యాత్ర, సభ ఉంటుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com