PAWAN: సజ్జనార్‌పై పవన్ ప్రశంసల జల్లు

PAWAN: సజ్జనార్‌పై పవన్ ప్రశంసల జల్లు
X
హై­ద­రా­బా­ద్ పో­లీ­సు­ల­పై ఏపీ డి­ప్యూ­టీ సీఎం పవన్ ప్ర­శం­సల జల్లు

సినీ పరి­శ్ర­మ­కు ప్ర­స్తు­తం అతి­పె­ద్ద సవా­లు­గా పరి­ణ­మిం­చిన పై­ర­సీ భూ­తా­న్ని కట్ట­డి చే­య­డం­లో తె­లం­గాణ పో­లీ­సు­లు సా­ధిం­చిన వి­జ­యం దే­శ­వ్యా­ప్తం­గా సినీ వర్గా­ల­కు గొ­ప్ప ఊర­ట­ని­చ్చిం­ది.ఐ బొ­మ్మ రవి­ని అరె­స్ట్ చేసి వి­జ­యం సా­ధిం­చిన హై­ద­రా­బా­ద్ పో­లీ­సు­ల­పై ఏపీ డి­ప్యూ­టీ సీఎం పవన్ ప్ర­శం­సల జల్లు కు­రి­పిం­చా­రు. పవ­న్‌­క­ల్యా­ణ్‌ ఎక్స్‌ వే­ది­క­గా స్పం­దిం­చా­రు.

సజ్జనార్ కదలిక తెచ్చారు

‘‘డబ్బుల రూ­పం­లో­నే కాదు, సృ­జ­నా­త్మ­క­త­నూ పె­ట్టు­బ­డి­గా పె­ట్టి ని­ర్మిం­చే సి­ని­మా­లు వి­డు­ద­లైన రోజే ఆన్‌­లై­న్‌­లో­కి వచ్చే­స్తు­న్నా­యి. దీ­ని­వ­ల్ల చి­త్ర పరి­శ్రమ తీ­వ్రం­గా నష్ట­పో­తోం­ది. సి­ని­మా వి­డు­ద­లే ఒక మహా­య­జ్ఞం­గా మా­రి­పో­యిన తరు­ణం­లో పై­ర­సీ ము­ఠా­ల­ను కట్ట­డి చే­య­డం దర్శ­క­ని­ర్మా­త­ల­కు సా­ధ్యం కా­వ­డం లేదు. పై­ర­సీ­లో కీ­ల­కం­గా ఉన్న ఐబొ­మ్మ, బప్ప­మ్ వె­బ్‌­సై­ట్ల ని­ర్వా­హ­కు­డి­ని హై­ద­రా­బా­ద్ పో­లీ­సు­లు అరె­స్టు చేసి, వా­టి­ని మూ­యిం­చి­వే­య­డం స్వా­గ­తిం­చ­ద­గ్గ పరి­ణా­మం. పో­లీ­సు­ల­కు సైతం సవా­ల్ వి­సి­రే స్థా­యి­కి పై­ర­సీ ము­ఠా­లు వచ్చిన తరు­ణం­లో హై­ద­రా­బా­ద్ సై­బ­ర్ క్రైం పో­లీ­సు­బృం­దం చే­సిన ఆప­రే­ష­న్ వి­జ­య­వం­త­మైం­ది. ఈ ఆప­రే­ష­న్‌­లో భా­గ­మైన పో­లీ­సు­ల­కు, సిటీ కమి­ష­న­ర్ వి.సి.సజ్జ­నా­ర్‌­కి అభి­నం­ద­న­లు తె­లి­య­జే­స్తు­న్నా’’ అని పవ­న్‌­ ప్ర­శం­సిం­చా­రు. పై­ర­సీ­తో సి­నీ­రం­గా­ని­కి చాలా నష్టం జరి­గిం­ద­ని, దీ­న్ని కట్ట­డి చే­య­డం­లో భా­గం­గా ఐబొ­మ్మ ని­ర్వా­హ­కు­డు ఇమ్మ­డి రవి­ని అరె­స్టు చే­సి­న­ట్లు పో­లీ­స్‌ కమి­ష­న­ర్‌ సజ్జ­నా­ర్‌ మీ­డి­యా­కు తె­లి­పా­రు. అత­డి­పై ఐటీ యా­క్ట్‌, కాపీ రై­ట్‌ యా­క్ట్‌ కింద మరో 4 కే­సు­లు నమో­దు చే­సి­న­ట్లు చె­ప్పా­రు.

"ఐబొమ్మ రవి టాలెండ్ వాడుకోండి"

పై­ర­సీ వె­బ్‌­సై­ట్ ఐబొ­మ్మ ని­ర్వా­హ­కు­డు రవి అరె­స్ట్‌­పై నటు­డు శి­వా­జీ షా­కిం­గ్ కా­మెం­ట్స్ చే­శా­రు. అతను చాలా టా­లెం­టె­డ్‌­గా కని­పి­స్తు­న్నా­డు. అతని హ్యా­కిం­గ్ తె­లి­వి­ని దేశ భద్ర­త­కు పని­కొ­చ్చే­లా ఉప­యో­గిం­చు­కో­వ­చ్చ­ని సూ­చిం­చా­రు. అతను చే­సిం­ది దు­ర్మా­ర్గ­మైన పనే అన్నా­రు. రవి తన కసి­ని మంచి పని­కి వి­ని­యో­గిం­చి ఉంటే బా­గుం­డే­ద­న్నా­రు. ఇక నుం­చి అయి­నా రవి మా­రా­ల­ని కో­రు­కుం­టు­న్న­ట్టు ఓ మూవీ ఈవెం­ట్లో శి­వా­జీ పే­ర్కొ­న్నా­రు. శి­వా­జీ వ్యా­ఖ్య­ల­ను పలు­వు­రు స్వా­గ­తి­స్తు­న్నా­రు.

Tags

Next Story