PAWAN: కలెక్టర్లు, ఎస్పీలకు పవన్ కీలక ఆదేశాలు

శాంతి భధ్రతలపై సమీక్షలో వివిధ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. శాంతి భధ్రతల విషయంలో కలెక్టర్లు, ఎస్పీలు కఠినంగా ఉండాలన్నారు. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించే నేరాలను అస్సలు ఉపేక్షించొద్దని చెప్పారు.15 శాతం వృద్ధిరేటు సాధించాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. నేరాల్లో నిర్లిప్తంగా ఉండటం సరికాదని పవన్ కళ్యాణ్ సూచించారు. ’15 శాతం వృద్ధి రేటు సాధించాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యం. విశాఖలో కొందరు ఆకస్మికంగా వచ్చి దాడి చేస్తే పోలీసు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసినా ఏమీ పట్టించుకోలేదు. కొందరు రాజకీయ నేతలు దీని వెనుక ఉన్నారు, చర్యలు తీసుకోకపోవటం ఇబ్బందికరం. నేరాల్లో నిర్లిప్తంగా ఉండటం సరికాదు. అధికారంలో ఉండి కూడా ఏమీ చేయటం లేదనే విమర్శలు ఎదుర్కోంటున్నాం. కఠినంగా వ్యవహరించాలని ఎస్పీలు, కలెక్టర్లను ఆదేశిస్తున్నాం. ప్రజాప్రయోజనాలకు విఘాతం కలిగించేలా జరుగుతున్న నేరాల పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు’ అని కలెక్టర్లు, ఎస్పీలతో డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఇక 22వ తేదీన జనసేన ‘పదవి – బాధ్యత’ సమావేశం జరగనుంది. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ తరఫున నామినేటెడ్ పదవులు పొందిన వారితో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్రానికి గ కారణం: పవన్ కల్యాణ్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎకనమిక్ టైమ్స్ సంస్థ 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' పురస్కారాన్ని ప్రకటించడం సంతోషదాయకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వ శైలి ఎంతో స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం, నవతరం భవిష్యత్తు కోసం ఆయన అమలు చేస్తున్న పాలన విధానాలు, పారిశ్రామికవృద్ధికి చేపడుతున్న సంస్కరణలు కచ్చితంగా సత్ఫలితాలనిస్తాయని అభిప్రాయపడ్డారు. ఆయనకు దక్కిన ఈ అవార్డు రాష్ట్రమంతటికీ గర్వ కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పురస్కారం ద్వారా రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, అంతకుముందు నారా లోకేష్ కూడా చంద్రబాబు వచ్చిన అవార్డుపై స్పందించారు. చంద్రబాబుకు ఈ అవార్డు రావడం రాష్ట్రానికి గర్వకారణం. రాష్ట్రంతో పాటు మా కుటుంబానికి ఇది ఎంతో ప్రతిష్ఠాత్మకం. సంస్కరణలను చంద్రబాబు ధైర్యంగా ముందుకు తీసుకెళ్లారని ప్రశంసించారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది అని లోకేశ్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

