PAWAN; గూడెం గూటికి పండగొచ్చింది

PAWAN; గూడెం గూటికి పండగొచ్చింది
X
మరో వాగ్దానం నెరవేర్చిన డిప్యూటీ సీఎం పవన్.. అల్లూరి జిల్లా గూడెం గ్రామానికి విద్యుత్ వెలుగులు.. ఏడున్నర దశాబ్దాల తర్వాత గ్రామాల్లోకి కరెంట్

డి­ప్యూ­టీ సీఎం పవన్ మరో­సా­రి తన కా­ర్య దక్ష­త­తో ప్ర­జల మనసు దో­చు­కు­న్నా­రు. దే­శా­ని­కి స్వా­తం­త్ర్యం వచ్చి ఏడు­న్నర దశా­బ్దా­లు దా­టి­నా ఇంకా మౌ­లిక వస­తు­ల­కు నో­చు­కో­ని మా­రు­మూల గిరి శిఖర గ్రా­మా­లు ఇంకా ఎన్నో ఉన్నా­యి. అలాం­టి మరు­గున పడిన గ్రా­మా­ల్లో ఒక­టైన అల్లూ­రి సీ­తా­రా­మ­రా­జు జి­ల్లా అనం­త­గి­రి మం­డ­లం రొం­ప­ల్లి గ్రామ పం­చా­య­తీ పరి­ధి­లో­ని 'గూ­డెం' ఒకటి. అలాం­టి గ్రా­మం­లో వి­ద్యు­త్ బల్బు వె­లు­గు వా­రి­లో కొ­త్త ఆనం­దా­న్ని ఇచ్చిం­ది. తొ­లి­సా­రి­గా వి­ద్యు­త్ వె­లు­గు చూ­సిన జనం సం­తో­షం­తో సం­బ­రా­లు చే­సు­కుం­టు­న్నా­రు. ఉప ము­ఖ్య­మం­త్రి పవన్ తీ­సు­కు­న్న చొరవ కా­ర­ణం­గా అతి తక్కువ కా­లం­లో­నే ఇది సా­ధ్య­మైం­ది. ఇప్పు­డు ఆ పల్లె­లో 17 కు­టుం­బా­ల్లో చీ­క­టి తొ­ల­గి­పో­యిం­ది. కా­ర్తీక పౌ­ర్ణ­మి పవి­త్ర ది­నాన బయట వె­న్నెల కాం­తు­లు, గూ­డెం ప్ర­జల ఇళ్ల­లో వి­ద్యు­త్ కాం­తు­లు ప్ర­కా­శిం­చా­యి.

17 ఆవా­సా­ల­కు వి­ద్యు­త్ ఇవ్వ­డం కోసం 9.6 కి­లో­మీ­ట­ర్ల మేర అడ­వు­లు, కొండ ప్రాం­తాల గుం­డా వి­ద్యు­త్ లై­న్ల­ను వే­యా­ల్సి ఉం­టుం­ది. ఈ క్లి­ష్ట­మైన ప్రా­జె­క్టు­కు సు­మా­రు రూ.80 లక్ష­ల­కు­పై­గా ఖర్చు అవు­తుం­ద­ని అధి­కా­రు­లు అం­చ­నా వే­శా­రు. ఈ అధిక వ్య­యం, భౌ­గో­ళిక అడ్డం­కుల దృ­ష్ట్యా, పవన్ కల్యా­ణ్.. వి­ద్యు­త్ మం­త్రి గొ­ట్టి­పా­టి రవి­కి, ఏపీ జె­న్కో సీ­ఎం­డీ­ల­కు సమ­స్య­ను తె­లి­య­జే­శా­రు. అవ­స­రమై­తే తక్ష­ణం కేం­ద్ర ప్ర­భు­త్వ సాయం తీ­సు­కు­ని సమ­స్య పరి­ష్క­రిం­చా­ల­ని కో­రా­రు. ఉప ము­ఖ్య­మం­త్రి పవన్ చే­సిన సూచన మే­ర­కు, భారత ఇంధన మం­త్రి­త్వ­శాఖ పరి­ధి­లో­ని నాన్ పీ­వీ­జీ­టీ పథకం ద్వా­రా గి­రి­జన గ్రా­మం­లో వి­ద్యు­త్ శాఖ వె­లు­గు­లు నిం­పిం­ది. కేం­ద్ర ప్ర­భు­త్వ ని­ధు­లు, వి­ద్యు­త్ శాఖ సా­యం­తో పను­లు పూ­ర్త­య్యా­యి.

Tags

Next Story