PAWAN: పవన్ వార్నింగ్‌తో వైసీపీలో కలకలం

వైసీపీ నేతల విమర్శలపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఏకంగా జగన్‌ను టార్గెట్ చేసి పవన్ చేసిన విమర్శలు.. వైసీపీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కౌంటర్
మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో తీసుకున్న వారిని జైల్లోకి పంపిస్తామని వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. తాడేపల్లిగూడెంలోని పెరవలిలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ అక్కడ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడే అమరజీవి జలధార పథకానికి శంకుస్థాపన చేశారు. ప్రజలకు తాగునీరు అందించాలనే ఉద్దేశం 7,910 కోట్లు ఖర్చు పెట్టి ఈ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమరజీవి జలధార కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా తన వచ్చిన విమర్శలు ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఎన్నో కష్టాలు ఎదురుదెబ్బలు తిని పార్టీని పదేళ్లుగా నడుపుతూ వచ్చానని అన్నారు. ప్రజల కోసం చాలా తగ్గినట్టు చెప్పారు. దీన్ని అర్థం చేసుకోలేని వాళ్లు తాను టికెట్లు అమ్ముకున్నట్టు, డబ్బులకు లొంగిపోయినట్టు విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ పొట్టి శ్రీరాములు లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఓ వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడంటే, దేశమంటే, ప్రజలంటే ఎంత పిచ్చి ఉండాలని అన్నారు. అలాంటి వ్యక్తిని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇంతలా తీర్పు ఇచ్చినా కొందరికి బుద్ది రాలేదని పవన్ ఫైర్ అయ్యారు. ఇంకా రాష్ట్రంలో రౌడీయిజం చేస్తున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. ఇలాంటి వాటి ఆట కట్టించేందుకు తమకు రెండు రోజుల సమయం చాలని అన్నారు.
రాజకీయ నిర్ణయం వరకూ తీసుకెళ్లొద్దు
బూర్గుల రామకృష్ణారావు, పొట్టి శ్రీరాములు ఎప్పుడూ తన గుండెల్లో ఉంటారని పవన్ క అన్నారు. ‘‘ప్రాజెక్టు ఎందుకు ఆలస్యమవుతుందంటూ వైకాపా నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడూ బెదిరింపులకు భయపడలేదు. దౌర్జన్యాలకు దిగుతూ మళ్లీ వస్తామంటూ దిగజారి మాట్లాడుతున్నారు. రెండు రోజులు కిరాయి గూండాలు, రౌడీల వివరాలు ఆరా తీస్తే పరిస్థితి తెలుస్తుంది. రౌడీలపై రాజకీయ నిర్ణయం తీసుకుంటే మళ్లీ ఇలాంటి మాటలు రావు. ఆరోపణలు చేసేవారిని హెచ్చరిస్తున్నా.. రాజకీయ నిర్ణయం వరకూ తీసుకెళ్లొద్దు. అధికారం ఉన్నా.. లేకపోయినా.. పవన్ ఎప్పుడూ పవన్‌లానే ఉంటాడు. వైకాపా రౌడీలకు యోగి ఆదిత్యనాథ్ వంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి’’ అని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఎన్ని విమర్శలైనా ఎదుర్కొనేందుకు సమాధానం చెప్పేందుకు సిద్ధమని పవన్ తెలిపారు. కానీ ప్రతి దానకి ఓ లిమిట్ ఉంటుందని, అలాంటి వారికి గట్టి ట్రీట్మెంట్ ఇస్తామని తెలిపారు. అడ్డగోలుగా ఏది పడితే అది చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదన్నారు. తాజాగా ప్రారంభించిన అమరజీవి జలధార ఐదు జిల్లాల ప్రజలకు మేలు చేస్తుందని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

