PAWAN: జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొననున్న పవన్..?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి జనసేన పార్టీ అధికారికంగా మద్దతు ప్రకటించింది. జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి లతో హైదరాబాద్లోని సాగర్ సొసైటీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహా ఇరుపార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ భేటీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని విజయవంతం చేయడానికి జనసేన పార్టీ పూర్తిస్థాయి సహకారం అందించనున్నట్లు శంకర్ గౌడ్ తెలిపారు. రెండు పార్టీల నాయకులు సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించి, తమ సంయుక్త ప్రచార కార్యాచరణ వివరాలను వెల్లడించనున్నారు.
ఎదురుమొండి దీవుల వాసుల కల నెరవేరుస్తా
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ఎదురుమొండి దీవుల వాసుల చిరకాల కల ఏటిమొగ, ఎదురుమొండి హై లెవల్ వంతెన నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కృషి చేస్తామని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోపాటు సాస్కీ పథకం నుంచి నిధులు సమకూరుస్తామన్నారు. అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో అవుట్ ఫాల్ స్లూయిజ్ ల పునరుద్ధరణకు తక్షణం చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు త్వరితగతిన పూర్తి చేయడంతోపాటు కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పవన్ అధికారులను ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

