- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- అన్నమయ్య డ్యామ్ దుర్ఘటనపై...
అన్నమయ్య డ్యామ్ దుర్ఘటనపై పవన్‌కళ్యాణ్ ట్వీట్

ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. 2021లో అన్నమయ్య డ్యామ్ దుర్ఘటన పై జనసేనాని ట్వీట్ చేశారు. 19.11.2021 తేదీన తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షాలకు ఎన్నడూ రానంత వరద మూడు లక్షల ఇరవై వేల క్యూసెక్కులు రావడంతో డ్యామ్ మట్టికట్ట తెగిపోయిందని, హఠాత్తుగా సంభవించిన ఈ వరద వలన చేయరు నది ఒడ్డున ఉన్నమందపల్లి, తొగురుపేట, పులపతూరు, గుండ్లూరు గ్రామాలలోని 33 మంది ప్రజలు జల సమాధి అయ్యారని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజలు జలసమాధి అయ్యారన్న పవన్.. ఇది రాష్ట్రప్రభుత్వ వైఫల్యమని కేంద్ర జలవనరుల శాఖ క్లారిటీ ఇచ్చిందని అన్నారు. అస్మదీయుడు పొంగులేటికి 3.94 శాతం..అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని 660 కోట్లకు అప్పచెప్పారని ట్వీట్ చేశారు.
ప్రమాద ఘటన జరిగిన వెంటనే సీఎంచీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ వేస్తున్నామని అసెంబ్లీలో చెప్పారని.. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారని అన్నారు. మరి ఆ కమిటీ ఏమైందో వారు రాష్ట్రంలోని మిగతా డ్యాములకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏ చర్యలు తీసుకున్నారు ఆ దేవుడికే ఎరుక. అంటూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com