AP: రైతన్నకు తీవ్ర నష్టం మిగిల్చిన వర్షం

తమిళనాడు, పుదుచ్చేరిలో ఫెంగల్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు రైతన్న లకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. వరి పంట నీటమునిగింది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురవడంతో అన్నమయ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి పంట ఒరిగింది. వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం నిమ్మనపల్లె మండలంలోని రైతులు 1200 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా ఇప్పటికే 60శాతానికి పైగా పంట ను కాపాడుకున్నారని మిగిలిన450 ఎకరాల్లోని వరి పంట తుషాన ధాటికి దెబ్బతినింది. మరో రెండు రోజులు వర్షా లు కొనసాగుతాయని వాతావరణశాఖా తెలుపడం తో మండలంలో 70ఎకరాల్లో వున్న టమాటా పం టకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని రైత న్నలు ఆందోళన చెందుతున్నారు. చేతికివచ్చిన పంట తుపాను ధాటికి నేల మట్టం కావడంతో ప్రభుత్వమే తమను అన్ని విధాల ఆదుకోవాలని రైతన్న లు కోరుతున్నారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఆంధ్రప్రదేశ్ లో ఎడతెరపి లేని వానలకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పీలేరులో ఓ విద్యుత ట్రాన్సఫార్మర్ పేలిపోయింది. సదుం, సోమల మండలాల్లో కురుస్తున్న వర్షాలకు పింఛా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో కొత్తపల్లె సమ్మర్ స్టోరేజ్‌కు నీటి కొరత తీరనుందని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. పీలేరు-మదనపల్లె మార్గంలోని బడబళ్లవంకపై నిర్మించిన చెక్ డ్యామ్ నిండి మొరవపోతోంది.
తంబళ్లపల్లెలో ఓ మోస్తరు వర్షం
ఫెంగల్ తుఫాను ప్రభావం కారణంగా తంబళ్లపల్లెలో ఆకా శం మేఘావృతమై ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ముసురు అల ముకుని ఎడతెరపిలేకుండా చిరుజల్లులు కురుస్తూ నే ఉన్నాయి. శీతాకాలంకు తోడు తుపాను ప్రభా వంతో చలిగాలులు తీవ్రమయ్యాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కాగా, తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలు వరి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే మండలం లో సుమారు 80 శాతం పైగా వరి కోతలు పూర్త వ్వగా..ఇంకా కొంత వరకు వరి పంట కోత దశలో ఉంది. తుపాను కారణంగా భారీ వర్షాలు కురిస్తే వరి పైరు నేల వాలి ధాన్యం మొలకలొచ్చే అవకా శం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తుఫాన కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్దమండ్యం తహసీల్దార్ కార్యాలయం ఉరుస్తోంది. కార్యాలయ భవనంలోని గదులన్నీ ఉరుస్తుండడంతో రెవె న్యూ అధికారులు, సిబ్బంది ఇక్కట్లు పడుతున్నారు. వీడియో కాన్ఫరెన్స గది, కంప్యూటర్ గది పూర్తిగా ఉరుస్తున్నాయి. వాటితో పాటు కార్యాలయ పైకప్పు పెచ్చులు విరిగి పడుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com