జగన్‌ సభ నుంచి జనాలు జంప్‌

జగన్‌ సభ నుంచి జనాలు జంప్‌
సీఎం జగన్‌ సభలో మరోసారి సేమ్‌ సీన్‌ రీపీటయింది. ఎప్పటి లాగే జగన్‌ సభ నుంచి జనం జంప్‌ అయ్యారు

సీఎం జగన్‌ సభలో మరోసారి సేమ్‌ సీన్‌ రీపీటయింది. ఎప్పటి లాగే జగన్‌ సభ నుంచి జనం జంప్‌ అయ్యారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎంతో ఆర్భాటంగా సభకు ఏర్పాట్లు చేశారు వైసీపీ నేతలు. పరిసర నియోజకవర్గాల నుంచి బస్సులో పెద్ద ఎత్తున జనాన్నితరలించారు. అయితే అంత కష్టపడి తరలించినా ప్రజలు కాసేపు కూడా ఉండలేదు. సీఎం రాకముందే అనేక మంది ప్రజలు జంప్‌ అయిపోయారు. ఇక సీఎం జగన్‌ ప్రసంగిస్తుండగానే అనేక మంది వెళ్లిపోయారు. గోడలు దూకి వెళ్లిపోయిన దృశ్యాలు, ప్రధాన గేటు నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపించాయి. ఇలా వెళ్లిపోతున్న వారిని అడ్డుకునేందుకు పోలీసులు, అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ మహిళలు మాత్రం ఆగలేదు. కనీసం సభలో కాసేపు కూడా కూర్చోవడానికి ఇష్టపడలేదు. సీఎం జగన్‌ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదంటున్నారు.


Tags

Read MoreRead Less
Next Story