perni nani: చీకట్లో చంపేసి.. పొద్దున్నే పరామర్శకు వెళ్లాలి

perni nani: చీకట్లో చంపేసి.. పొద్దున్నే పరామర్శకు వెళ్లాలి
X
వైసీపీ నేత పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. కన్ను సైగ చేస్తే లేపేయాలంటూ సూచన... మరింత బరితెగించి నేతలకు నాని పిలుపు

రప్పా రప్పా అని నరు­కు­తా­మ­ని అర­వ­డం కా­ద­ని, కను­సై­గ­తో­నే పని అయి­పో­వా­లం­టూ వై­కా­పా నేత, మాజీ మం­త్రి పే­ర్ని నాని చే­సిన వ్యా­ఖ్య­లు వై­ర­ల్‌­గా మా­రా­యి. కృ­ష్ణా­జి­ల్లా­లో వై­కా­పా కా­ర్య­క­ర్తల సమా­వే­శం­లో ఆయన పా­ల్గొ­ని మా­ట్లా­డా­రు. మనం అధి­కా­రం­లో­కి వచ్చాక.. ఇప్పు­డు తప్పు­లు చే­సిన వా­ళ్ల­ను నరి­కే­ద్దా­మం­టూ కా­ర్య­క­ర్త­ల్ని రె­చ్చ­గొ­ట్టా­రు. కూ­ట­మి నే­త­లు, కా­ర్య­క­ర్త­ల­ను లక్ష్యం­గా చే­సు­కుం­టా­మం­టూ పరో­క్షం­గా హె­చ్చ­రిం­చా­రు.

మరీ ఇంత బరితెగింపా..?

పే­ర్ని నాని వై­ఎ­స్ఆ­ర్‌­సీ­పీ నేత పే­ర్ని నాని టీ­డీ­పీ నే­త­ల్ని చం­పా­ల­ని పా­ర్టీ కా­ర్య­క­ర్త­ల్ని రె­చ్చ­గొ­డు­తు­న్నా­ర­న్న ఆరో­ప­ణ­లు ఎదు­ర్కొం­టు­న్నా­రు. ఆయన చే­స్తు­న్న వ్యా­ఖ్య­లు రా­జ­కీయ ప్ర­త్య­ర్థు­ల­పై హిం­స­ను ప్రో­త్స­హిం­చే­లా ఉన్నా­య­ని ఆరో­ప­ణ­లు వస్తు­న్నా­యి. రా­జ­కీయ ప్ర­త్య­ర్థు­ల­ను "చీ­క­ట్లో కన్ను కొ­ట్టి చం­పే­యా­ల­ని" కా­ర్య­క­ర్త­ల­కు సూ­చి­స్తు­న్నా­రు. "చీ­క­ట్లో కన్ను కొ­ట్టి చం­పే­యా­లి .. ఉద­య­మే వె­ళ్లి ఏమీ తె­లి­య­న­ట్లు­గా పరా­మ­ర్శిం­చా­ల­ని" సూ­చిం­చా­రు. ఈ వీ­డి­యో­లు సో­ష­ల్ మీ­డి­యా­లో వై­ర­ల్ అయ్యా­యి. "అరే ఎన్ని­సా­ర్లు"రప్పా రప్పా నరి­కే­స్తాం అని అర­వ­టం కాదు.. చీ­క­ట్లో మొ­త్తం అయి­పో­వా­లి.. తరు­వాత వె­ళ్లి ఎలా జరి­గిం­ది, ఏంటి అని పరా­మ­ర్శిం­చా­లి..." అని పే­ర్ని నాని తీ­వ్ర వి­వా­దా­స్పద వ్యా­ఖ్య­లు చే­శా­రు.

గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు

పే­ర్ని నాని గతం­లో కూడా టీ­డీ­పీ నా­య­కు­ల­పై వి­వా­దా­స్పద వ్యా­ఖ్య­లు చే­శా­రు. పే­ర్ని నాని వ్యా­ఖ్య­లు వై­ర­ల్ కా­వ­డం­తో, టీ­డీ­పీ మద్ద­తు­దా­రు­లు ఆయ­న­ను "నీ­చ­మైన రా­జ­కీ­యా­లు" చే­స్తు­న్నా­ర­ని వి­మ­ర్శిం­చా­రు. వి­వే­కా­నం­ద­రె­డ్డి­ని హత్య చే­సి­న­ట్లే అం­ద­ర్నీ చం­పా­ల­ని సల­హా­లి­స్తు­న్నా­ర­ని టీ­డీ­పీ మం­డి­ప­డిం­ది. టి­డి­పి కా­ర్య­క­ర్త­ల­కు, వై­సీ­పీ కా­ర్య­క­ర్తల మధ్య కొ­ట్టు­కు చచ్చేంత వైరం ఎం­దు­క­ని.. వా­ళ్ల మధ్య ఆస్తి తగా­దా­లు ఏమై­నా ఉన్నా­యా అని కొంత మంది ప్ర­శ్ని­స్తు­న్నా­రు. కా­ర్య­క­ర్త­ల­ను బలి చేసే ప్ర­య­త్నం చే­స్తు­న్నా­ర­ని ఆరో­పి­స్తు­న్నా­రు. హిం­స­కు ప్రే­రే­పి­స్తు­న్న పే­ర్ని నాని అరె­స్టు చే­యా­ల­ని టీ­డీ­పీ నే­త­లు డి­మాం­డ్ చే­స్తు­న్నా­రు. మాజీ మం­త్రి­గా ఉంటూ ప్ర­జా­స్వా­మ్యా­న్ని పెం­చే వి­ధం­గా కా­కుం­డా.. హిం­స­కు ప్రే­రే­పిం­చే­వి­ధం­గా మా­ట్లా­డ­టం దా­రు­ణ­మ­న్నా­రు. కృ­ష్ణా జి­ల్లా­లో బాబు ష్యూ­రి­టీ మోసం కా­ర్య­క్ర­మా­ల్లో మాజీ మం­త్రి పే­ర్ని నాని చే­స్తు­న్న వ్యా­ఖ్య­లు చర్చ­గా మా­రు­తు­న్నా­యి. పా­మ­ర్రు, అవ­ని­గ­డ్డ ని­యో­జక వర్గా­ల్లో చే­సిన వ్యా­ఖ్య­లు వై­ర­ల్ అవు­తు­న్నా­యి. ఇక, ము­ల్లు­ను ము­ళ్ళు­తో­నే తీ­యా­ల­న్నా­రు పే­ర్ని నాని.. అంతే తప్ప పదే పదే రప్పా రప్పా అని వే­లం­వె­ర్రి­గా మా­ట్లా­డ­కూ­డ­ద­ని కా­ర్య­క­ర్త­ల­కు చె­ప్పా­రు.

పేర్నినానికి పోలీసులు షాక్

మాజీ మం­త్రి పే­ర్ని నా­ని­పై కృ­ష్ణా జి­ల్లా అవ­ని­గ­డ్డ పో­లీ­స్ స్టే­ష­న్‌­లో కేసు నమో­దైం­ది. పే­ర్ని నాని వ్యా­ఖ్య­ల­పై ఆర్ పేట పో­లీ­సు­ల­కు ఇప్ప­టి­కే టీ­డీ­పీ నే­త­లు ఫి­ర్యా­దు చే­శా­రు. పా­మ­ర్రు­లో నాని చే­సిన వ్యా­ఖ్య­ల­పై కేసు నమో­దు­కు జి­ల్లా ఎస్పీ గం­గా­ధ­ర్ ఆదే­శా­లు ఇవ్వ­ను­న్నా­రు. మరో­వై­పు, జడ్పీ చైర్ పర్స­న్ ఉప్పాల హా­రిక కారు ధ్వం­సం­పై కూడా గు­డి­వాడ పో­లీ­సు­లు కేసు నమో­దు చే­శా­రు. కారు ధ్వం­సం­పై ఇప్ప­టి­కే పో­లీ­సు­ల­కి ఉప్పాల హా­రిక, ఆమె భర్త రాము ఫి­ర్యా­దు చే­శా­రు. మా­జీ­మం­త్రి పే­ర్ని నాని వ్యా­ఖ్య­ల­పై తె­లు­గు­దే­శం నా­య­కు­లు మచి­లీ­ప­ట్నం పో­లీ­సు­ల­కు ఫి­ర్యా­దు చే­శా­రు. కా­ర్య­క­ర్త­ల­ను రె­చ్చ­గొ­ట్టే వి­ధం­గా పే­ర్ని నాని వ్యా­ఖ్య­లు ఉన్నా­య­ని వారు ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు.

Tags

Next Story