న్యాయమూర్తులను భయపెట్టేలా ఏపీ సీఎం జగన్ చర్యలు.. సుప్రీంకోర్టులో పిటిషన్

న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ ఏపీ ప్రభుత్వ ప్రతినిధి పెట్టిన ప్రెస్‌మీట్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సునీల్‌కుమార్ సింగ్ అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేసిన ఫిర్యాదులో అంశాలపై ప్రెస్‌మీట్ ద్వారా వెల్లడించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు, న్యాయస్థానాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని పిటిషన్‌లో కోరారు. న్యాయస్థానాలను కించపరిచినందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలన్నారు.
న్యాయమూర్తులను భయపెట్టేలా ఏపీ సీఎం జగన్ చర్యలు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు సునీల్ కుమార్ సింగ్. ఆయన వైఖరి కారణంగా న్యాయస్థానాలపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పడే ప్రమాదముందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి వ్యవస్థ పరస్పరం గౌరవించుకోవాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని.. దురుద్దేశంతోనే జగన్ ప్రభుత్వ సలహాదారు విలేకరుల సమావేశం పెట్టారన్నారు. న్యాయవ్యవస్థకు కళంకం తెచ్చేలా వ్యవరిస్తున్నారని పిటిషిన్‌లో పేర్కొన్నారు సునీల్ కుమార్ సింగ్.
జడ్జిలపై ఆరోపణలతో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి ప్రెస్ కాన్ఫరెన్స్‌పై సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఏపీ సీఎంపై ఎందుకు చర్య తీసుకోకూడదో వెల్లడించేలా షోకాజ్ నోటీస్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పిటిషనర్ సునీల్ కుమార్ సింగ్ కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com