MODI: అమరావతికి ప్రధాని మోదీ

MODI: అమరావతికి ప్రధాని మోదీ
X
ఏప్రిల్ 15 నుంచి 20 మధ్య పర్యటన... రూ. లక్ష కోట్ల పనులకు మోదీ శ్రీకారం..!

భారత ప్రధాని మోదీ అమరావతి పర్యటన దాదాపు ఖరారు అయ్యింది. వచ్చే నెల 15 నుంచి 20 మధ్యలో అమరావతిలో మోదీ పర్యటించనున్నారు. రాజధాని పునః ప్రారంభ పనులకు ఆయన హాజరుకానున్నారు. రూ. లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని చేతుల మీదుగా శ్రీకారం చుట్టేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. రానున్న మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేసేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవైపు పోలవరం, రెండోవైపు అమరావతిని పరుగులు పెట్టించే పనిలో ఉంది. కేంద్రంలోని ప్రభుత్వ సహకారంతో నిధులకు కొరత లేకుండా చూసుకుంటూ గతంలో చేసిన తప్పిదాలు జరగకుండా జాగ్రత్తపడుతోంది. ఇప్పటికే ఫైనలైజ్ అయిన నిర్మాణాలు పూర్తి చేసేందుకు సిద్ధమైంది.

వైసీపీ నిర్లక్ష్యం

విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చాక 2015, అక్టోబరు 22న అమరావతి పనులకు మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి, డీజీపీ కార్యాలయాలను ప్రభుత్వం పూర్తిచేసింది. అయితే, వైసీపీ ప్రభుత్వం రావడంతో అమరావతి విధ్వంసం జరగడమే కాకుండా, రాజధానిని అటకెక్కించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. 17న జరిగే కేబినెట్ సమావేశంలో అమరావతి పనులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. నిర్మాణ పనులకు సంబంధించిన కాంట్రాక్ట సంస్థలకు పనులు అప్పగించే ప్రక్రియకు ఆమోదం తెలపనున్నారు. అనంతరం టెండర్లు దక్కించుకున్న సంస్థలకు పనులు ఇస్తూ ఆదేశాలు జారీ చేస్తారు. వారికి లెటర్లు పంపిస్తారు. అనంతరం అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. వీటి కోసం ప్రభుత్వం తొలి దశలో రూ.64,721 కోట్లు ఖర్చు పెట్టనుంది. ఇందులో రూ.37,702 కోట్ల పనులకు టెండర్లు కూడా ఖరారు చేశారు.

నేతలకు చంద్రబాబు మాస్ వార్నింగ్

టీడీపీలో గ్రూపు రాజకీయాలు వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు దిశా నిర్దేశం చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో ఇన్‌చార్జ్ మంత్రులు తప్పనిసరిగా పర్యటించాలని ఆదేశించారు. ఏ స్థాయిలో కూడా వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని చంద్రబాబు తేల్చి చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్ష ఉండదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు.

Tags

Next Story