పోలవరం ఇక అంతేనా?

పోలవరం ఇక అంతేనా?
2014 అంచనాల ప్రకారమే పోలవరంకు నిధులిస్తామంటూ కేంద్రం ఇచ్చిన షాక్‌తో.. ముందు నుయ్యి! వెనుక గొయ్యి అన్న చందంగా మారింది ఏపీ సర్కారు పరిస్థితి..

2014 అంచనాల ప్రకారమే పోలవరంకు నిధులిస్తామంటూ కేంద్రం ఇచ్చిన షాక్‌తో.. ముందు నుయ్యి! వెనుక గొయ్యి అన్న చందంగా మారింది ఏపీ సర్కారు పరిస్థితి. కేంద్రం తేల్చిచెప్పడంతో హాడావుడిగా శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం జగన్‌. రాష్ట్రం పంపిన అంచనాలు, కేంద్రం ఇస్తామన్న నిధులపై అధికారులతో చర్చలు జరిపారు. 2014 అంచనాల ప్రకారం 20వేల కోట్లే ఇస్తామంటోన్న కేంద్రం వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు. 55 వేల కోట్లతో రెండో డీపీఆర్‌కు అథారిటీ, కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపాయి. ఇందులో 47వేల కోట్లకు రివైజ్డ్‌‌ కాస్ట్‌ కమిటీ, కేంద్ర జల్‌శక్తిశాఖ ఆమోదం ఉంది. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌కే 29వేల కోట్లు కావాలని తేల్చి చెప్పారు అధికారులు. కేంద్రం చెబుతున్నట్లు 2014 అంచనా ప్రకారమైతే.. ప్రాజెక్టు పూర్తి చేయడం అసాధ్యమన్నారు అధికారులు....

కానీ సీఎం జగన్‌ మాత్రం... జాతీయ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కేంద్రంపైనే ఉందంటున్నారు. విభజన చట్టం, కేంద్ర కేబినెట్‌ నిర్ణయం దీన్నే అంగీకరిస్తుందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు మాత్రమే చూస్తోందని, ప్రాజెక్టు పర్యవేక్షణ అంతా పీపీఏ చూస్తోందన్నారు. ఈ అంశాలను కేంద్ర దృష్టికి తీసుకెళ్లాలని, సీడబ్ల్యూసీ, రివైజ్డ్‌‌ కాస్ట్‌ కమిటీ ఆమోదించిన అంచనాల అమలుకు కృషి చేయాలని అధికారులను‌ ఆదేశించారు సీఎం జగన్‌.

వైసీపీ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు.. కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదాతో పాటు పోలవరాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరంపై వైసీపీ చెత్త రాతలతో.. 30 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారాయన. పోలవరానికి జరిగిన అన్యాయం నుంచి అందరి దృష్టినీ మళ్లించేందుకే గీతం యూనివర్శిటీ కట్టడాలను కూల్చివేశారని దేవినేని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పోలవరాన్ని సైతం... అమరావతిలాగా చేస్తారంటూ విమర్శిస్తున్నాయి విపక్షాలు. అటు రైతులు, సామాన్యులు సైతం ఇదే ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమీండ్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story