POLAVARAM: పోలవరం 88 శాతం పూర్తి

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించిన మంత్రి, పనుల తీరుపై అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టులోని కీలక నిర్మాణాలను నిశితంగా పరిశీలించారు. ముఖ్యంగా రైట్ కనెక్టివిటీస్ పనులను. గ్యాప్-, గ్యాప్-2 ప్రాంతాలలో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా, ప్రాజెక్టు పనులలో నాణ్యత, వేగం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు.ప్రస్తుత ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 12 శాతం పనులను పూర్తి చేసిందని స్పష్టం చేశారు. రైట్ కనెక్టివిటీస్లో 82 శాతం, లెఫ్ట్ కనెక్టివిటీస్లో 62 శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి వివరించారు. డయాఫ్రంవాల్ నిర్మాణంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఇప్పటివరకు 950 మీటర్ల డయాఫ్రంవాల్ నిర్మాణం జరిగి, వాల్ పనులు 75 శాతం పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే ఫిబ్రవరి నాటికి కొత్త డయాఫ్రంవాల్ను కూడా పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనుల వేగం పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు కనెక్టివిటీ, అనుబంధ పనుల కోసం భారీగా రూ.542.85 కోట్లు విడుదల చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిధులు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన రవాణా, రక్షణ పనులకు ఉపకరిస్తాయి. ఈ నిధులలో ముఖ్యంగా మూడు కీలకమైన నిర్మాణ పనులకు ఆమోదం లభించింది. ఈ పనులు ప్రాజెక్టు ప్రాంతంలో రాకపోకలను సులభతరం చేయడంతో పాటు, స్థానిక మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

