POLAVARAM: కుంగిన పోలవరం కాఫర్ డ్యాం

POLAVARAM: కుంగిన పోలవరం కాఫర్ డ్యాం
X
ఎగువ కాఫర్ డ్యాంపై కుంగిన మట్టి రాళ్లు... కుంగిన ప్రాంతాన్ని పటిష్టపరిచిన అధికారులు... ప్రమాదం లేదని అధికారుల ప్రకటన

పో­ల­వ­రం ప్రా­జె­క్టు ని­ర్మా­ణా­న్ని ప్ర­తి­ష్టా­త్మ­కం­గా తీ­సు­కుం­ది ఆం­ధ్ర­ప్ర­దే­శ్ లోని కూ­ట­మి ప్ర­భు­త్వం.. ఎట్టి పరి­స్థి­తు­ల్లో­నూ 2027 నా­టి­కి పో­ల­వ­రం ప్రా­జె­క్టు­ను పూ­ర్తి చే­యా­ల­నే టా­ర్గె­ట్‌­తో ముం­దు­కు వె­ళ్తు­న్నా­రు. పది రో­జు­లు­గా ఎగు­వన కు­రు­స్తు­న్న భారీ వర్షా­ల­కు పో­ల­వ­రం ప్రా­జె­క్ట్‌­కు వర­ద­నీ­రు పో­టె­త్తిం­ది. దీం­తో ఎగువ కా­ఫ­ర్ డ్యాం­లో కొంత భాగం పా­డై­న­ట్టు తె­లు­స్తోం­ది. 10 అడు­గుల వె­డ­ల్పు, 8 అడు­గుల లో­తున కా­ఫ­ర్ డ్యాం­కు డ్యా­మే­జ్ వా­టి­ల్లి­న­ట్టు చె­బు­తు­న్నా­రు. ఇప్ప­టి­కే 2022 ఆగ­స్ట్ భారీ వర­ద­ల­కు ఎగువ కా­ఫ­ర్ డ్యాం సీ­పే­జ్ కొం­త­మేర దె­బ్బ­తిం­ది. ది­గు­వన బట్ర­స్ డ్యాం ని­ర్మా­ణం, ఎగు­వన ఎత్తు, వె­డ­ల్పు పెం­చిన చోటే ఇప్పు­డు కొం­త­మేర ని­ర్మా­ణం దె­బ్బ­తి­న్న­ట్టు సమా­చా­రం. అయి­తే, దీ­ని­వ­ల్ల పె­ద్ద­గా నష్టం లే­ద­ని ఇరి­గే­ష­న్ అధి­కా­రు­లు చె­బు­తు­న్నా­రు. దె­బ్బ­తి­న్న ప్రాం­తం­లో మర­మ్మ­తు­లు కూడా పూ­ర్తి చే­సి­న­ట్టు అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు. కా­ప­ర్ డ్యాం నుం­చి సీ­పే­జ్ కొ­న­సా­గు­తుం­డ­డం­తో.. ఎప్ప­టి­క­ప్పు­డు డీ వా­ట­రిం­గ్ చే­స్తూ డయా­ఫ్రం వాల్ ని­ర్మాణ పను­లు చే­ప­డు­తు­న్న­ట్టు తె­లు­స్తోం­ది. గతం­లో వచ్చిన వరదల కా­ర­ణం­గా కా­ప­ర్ డ్యాం­పై మరో రెం­డు మీ­ట­ర్లు ఎత్తు పెం­చా­రు అధి­కా­రు­లు.. అయి­తే, ఎత్తు పెం­చిన ప్రాం­తం­లో మా­త్ర­మే మట్టి జా­రిం­ద­ని.. వెం­ట­నే దా­ని­ని పటి­ష్ట­ప­రి­చా­మ­ని అధి­కా­రు­లు చె­బు­తు­న్నా­రు.

ఇదే మొదటిసారి కాదు

పో­ల­వ­రం ఎగువ కా­ఫ­ర్ డ్యాం దె­బ్బ­తి­న­డం ఇది మొ­ద­టి­సా­రి కాదు. గతం­లో 2022 ఆగ­స్టు నె­ల­లో వచ్చిన భారీ వర­ద­ల­కు కూడా ఇదే తర­హా­లో డ్యాం­కు నష్టం వా­టి­ల్లిన వి­ష­యం తె­లి­సిం­దే. ఇప్పు­డు మళ్లీ అదే సమ­స్య పు­న­రా­వృ­తం కా­వ­డం­తో ఆం­దో­ళన వ్య­క్త­మ­వు­తోం­ది. వరద ప్ర­వా­హం కొ­న­సా­గు­తుం­డ­టం­తో అధి­కా­రు­లు పరి­స్థి­తి­ని సమీ­క్షి­స్తు­న్నా­రు. దె­బ్బ­తి­న్న ప్రాం­తం­లో రి­పే­ర్లు చే­ప­ట్టి­న­ట్టు అధి­కా­రు­లు తె­లి­పా­రు. 2022లో వచ్చిన వరదల కా­ర­ణం­గా డ్యాం మరో రెం­డు మీ­ట­ర్లు అద­నం­గా పెం­చా­రు. పెం­చిన ప్రాం­తం­లో మా­త్రం కొ­ద్ది­గా మట్టి కుం­గ­డం­తో అధి­కా­రు­లు యు­ద్ధ ప్రా­తి­ప­ది­కన దా­న్ని పటి­ష్ట­ప­రి­చా­రు. కా­ప­ర్ డ్యాం పటి­ష్ట­త­కు తోడు ది­గు­వన బట్ర­స్ డ్యాం ని­ర్మా­ణం చే­ప­ట్ట­డం­తో పో­ల­వ­రం ప్రా­జె­క్టు పను­ల­కు ఎలాం­టి ఇబ్బం­ది లే­ద­ని అధి­కా­రు­లు స్ప­ష్టం చే­స్తు­న్నా­రు. కా­ఫ­ర్‌ డ్యాం వె­డ­ల్పు 9 మీ­ట­ర్లు ఉం­డే­లా.. ఎత్తు మరో 2 మీ­ట­ర్ల మేర పటి­ష్ఠం చే­శా­రు. అలా పైన పెం­చిన ప్రాం­తం­లో మా­త్ర­మే ఇప్పు­డు కొ­ద్ది­గా జా­రిం­ద­ని అధి­కా­రు­లు వి­వ­రిం­చా­రు. మళ్లీ వా­హ­నాల రా­క­పో­క­లు కూడా ప్రా­రం­భ­మ­య్యా­య­ని, సమ­స్య ఏమీ లే­ద­ని తె­లి­పా­రు.

Tags

Next Story