కర్నూలులో తుంగభద్ర పుణ్యస్నానాలను అడ్డుకున్న పోలీసులు

కర్నూలులో తుంగభద్ర పుణ్యస్నానాలను అడ్డుకున్న పోలీసులు

కర్నూలులో తుంగభద్ర పుణ్యస్నానాలను పోలీసులు అడ్డుకున్నారు.. సంకల్‌ బాగ్‌ ఘాట్‌ దగ్గర తుంగభద్ర నదిలో రాష్ట్ర బీజేపీ నేత హరీష్‌ బాబుతో సహా మరికొందరు పుణ్యస్నానాలు చేశారు. అయితే పుణ్యస్నానాలకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు.. బీజేపీ నేతలను అరెస్ట్‌ చేశారు. దీంతో ఏపీ సర్కార్‌ తీరుకు నిరసనగా హిందూ సంఘాలు చలో తుంగభద్రకు పిలుపు ఇచ్చాయి. సీఎం జగన్‌ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు.. తెలంగాణలో స్నానాలకు అనుమతి ఇచ్చినప్పుడు.. ఇక్కడ ఎందుకు అనుమతి లేదని ప్రశ్నించారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన బీజేపీ, వీహెచ్‌పీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Tags

Next Story