BABU REMAND: వెనక్కి తగ్గని తెలుగు తమ్ముళ్లు

BABU REMAND:  వెనక్కి తగ్గని తెలుగు తమ్ముళ్లు
ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న నిరసనలు.... చంద్రబాబుకు సంఘీభావంగా ఆందోళనలు

తమ అభిమాన నాయకుడి అరెస్టు, రిమాండు, కారాగారానికి తరలిస్తున్న వార్తలు, అక్కడ బాబు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూస్తూ తీవ్ర వ్యథకు గురైన టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించి జైలులో పెట్టారని మండిపడుతున్నారు.నాలుగున్నరేళ్ల జగన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు. వైకాపా గ్రాఫ్ తగ్గిపోతుండడంతోనే చంద్రబాబు ప్రజల్లో తిరగకుండా అడ్డుకునేందుకు కుట్ర పన్నారనిమాజీమంత్రి చినరాజప్ప ఆరోపించారు. జైలులో చంద్రబాబు భద్రతపై తమకు అనుమానాలున్నాయని....కేంద్రం, గవర్నర్ కలుగజేసుకుని చంద్రబాబుకు భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు.


తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనలు నిర్వహించినందుకు గుడివాడ తెలుగుదేశం నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పార్టీ నేత వెనిగండ్ల రాము, వేనిగండ్ల రామకృష్ణ, కడియాల గణేష్ సహా మరో 40 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 144 యాక్టును అతిక్రమించి చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ అభియోగాలు మోపారు. యూట్యూబర్ ఫిర్యాదు మేరకు రాము అనుచరుడు సందీప్ పై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై... రాష్ట్రంలోని పలు చోట్ల తెలుగు దేశం పార్టీ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. అక్రమ అరెస్టును వెంటనే నిలుపుదల చేసి.. చంద్రబాబును తక్షణం విడుదల చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు.


ఎన్నికల్లో ఓటమి భయంతోనే.... చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని.... తెలుగుదేశం నేత యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో లక్షలమందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తే నేరమా అని ప్రశ్నించారు. వివేకాను హత్య చేసి.... అవినాష్ జైలుకు పోకుండా జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టేందుకు వైకాపా కుట్రపన్నుతోందని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story