పోలీసుల ఓవరాక్షన్.. అనంతపురంలో జేసీ పవన్ అరెస్ట్

అనంతపురం నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నేతల పట్ల పోలీసుల ఓవరాక్షన్ చేశారు. మైనార్టీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా.. టీడీపీ నేత జేసీ పవన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనలకు అనుమతి లేదంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు. ర్యాలీకి దిగిన జేసీ పవన్‌తో పాటు టీడీపీ శ్రేణులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడికి భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు.. జేసీ పవన్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీస్ జీపును చుట్టుముట్టారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర తోపులాటలు, ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
జేసీ పవన్‌తో పాటు టీడీపీ శ్రేణులను రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై జేసీ పవన్, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వైసీపీ నేతల కనుసన్నల్లో పని చేస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తే పోలీసులకు వచ్చే ఇబ్బందేంటని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com