రోడ్డు పక్కన రూ.2.5 కోట్ల కరెన్సీ నోట్లు.. బ్యాగ్ చూసి బేజారు

రోడ్డు పక్కన రూ.2.5 కోట్ల కరెన్సీ నోట్లు.. బ్యాగ్ చూసి బేజారు
పోలీసులు బ్యాగును పరిశీలించి అందులో ఉన్న రెండు వేలు, ఐదు వందల నోట్లు ఉన్నట్లు తెలుసుకున్నారు.

వేలు, లక్షలు కాదు కోట్లు.. కష్టపడి సంపాదించిన సొమ్ము కాదా.. ఎక్కడో కొట్టుకొచ్చి పట్టుపడతానేమోనని చివరి నిమిషంలో పడేసి వెళ్లిపోయాడా.. అదే విషయాన్ని పరిశోధించాలనుకున్నారు పోలీసులు. గుంటూరు జిల్లాలో రోడ్డు పక్కన కరెన్సీ కట్టలు ఉన్న బ్యాగ్ స్థానికుల కంట పడింది. బ్యాగు చూసి భయపడిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడు చేరుకున్న పోలీసులు బ్యాగును పరిశీలించి అందులో ఉన్న రెండు వేలు, ఐదు వందల నోట్లు ఉన్నట్లు తెలుసుకున్నారు.

పోలీసులు ఆ బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నోట్లను నిశితంగా పరిశీలించగా అవి నకిలీ నోట్లని తేలాయి. రెండు వేల నోటుపై చిల్డ్రన్స్ కరెన్సీ అని ముద్రించి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు వెంగళాయపాలెం హైవేపై నకిలీ కరెన్సీ బ్యాగును వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. నకిలీ కరెన్సీ మొత్తం 2.5 కోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బ్యాగును ఎవరు వదిలి వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇంత పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ దొరకడంతో వారి ముఠా పెద్దదే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవలే జిల్లాలో ఒక నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు చేశారు. తాజాగా మళ్లీ ఈ కేసు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story